AP News: ఆ ఉద్యోగినులకు జగన్ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు

మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభు­త్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐదు ప్రత్యేక సాధారణ సెలవులను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత రెగ్యులర్‌ మహిళా ఉద్యోగులకు మాత్రమే ఈ సౌలభ్యం ఉంది. కానీ ఇప్పుడు....

AP News: ఆ ఉద్యోగినులకు జగన్ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. 5 ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు

Updated on: Apr 12, 2023 | 9:59 AM

ఏపీలోని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారు ఐదు రోజుల ప్రత్యేక సాధారణ సెలవులు వినియోగించుకునేలా జీవో నంబర్‌ 39 జారీ చేసింది. తొలుత రెగ్యులర్ మహిళా ఉద్యోగులకు ఈ సౌలభ్యం కల్పించారు. దీంతో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ నుంచి రిక్వెస్టులు వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం  విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన సానుకూలంగా స్పందించి.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తాజాగా రాష్ట్ర ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది.

ఉద్యోగినులకు ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అదనంగా 5 స్పెషల్ క్యాజువల్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో సీఎం జగన్‌కు ప్రభుత్వంలో పనిచేస్తున్న  ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ మహిళా ఉద్యోగులు ధన్యావాదాలు తెలిపారు. సచివాలయ ఉద్యోగుల సంఘం తరఫున సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి సైతం సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..