Rakhi Flowers: అద్భుతం.. కనువిందు చేసేలా ఒకే పాదుకు ఒకేసారి 457 రాఖీ పుష్పాలు

| Edited By: Surya Kala

May 30, 2024 | 7:17 AM

ప్రకృతి అందాలకు నిలువైన రంపచోడవరం రాజవొమ్మంగిలోని వెంకటేశ్వరరావు ఇంట్లో పెంచుకున్న తీగ జాతికి చెందిన రాఖీ పాదుకు 457 పుష్పాలు పూశాయి. ఆదివారం ఇదే పాదుకు ఏకంగా అంతకుమించి పుష్పాలు పూశాయి. అయిదేళ్లుగా పెంచుతున్న ఈ మొక్క గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో విరగబడి పువ్వులను పుష్పించలేదు. అలాంటిది కేవలం రెండు రోజుల వ్యవధిలోనే విపరీతంగా పుష్పాలు పూయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది

Rakhi Flowers: అద్భుతం.. కనువిందు చేసేలా ఒకే పాదుకు ఒకేసారి 457 రాఖీ పుష్పాలు
Rakhi Flowers
Follow us on

రాఖీ పండుగ అన్నా, రాఖీ పువ్వన్నా మనకు అనుబంధం ఎక్కువ. అక్క-తమ్ముళ్ల అనుబంధాలకి, ప్రేమానురాగాలకు, మమతలకు ప్రాకారం, ఆప్యాయతకు నిలువెత్తు రూపంగా రక్షాబంధన్ ను చూస్తాం. ధనిక, పేద , చిన్న, పెద్ద తేడా లేకుండా తమ తమ స్తోమత, స్థాయిని బట్టి కాగితం నుండి బంగారంతో చేయించిన రాఖీలను అక్క, చెల్లెలు తమ సోదరులకు కట్టి తమ ఆప్యాయతను అనురాగాలను పంచుకుంటారు. అదే రాఖీని పువ్వు చూసినా, దొరికినా నిజంగా పండుగే. అందుకే ప్రకృతి కూడా తాను ఏ మాత్రం తీసిపోను అన్నట్టుగా ఈ సీజన్ లో రాఖీని పూల రూపంలో వికసిస్తూ చూపరులకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది.

రాజవొమ్మంగిలో….

ప్రకృతి అందాలకు నిలువైన రంపచోడవరం రాజవొమ్మంగిలోని వెంకటేశ్వరరావు ఇంట్లో పెంచుకున్న తీగ జాతికి చెందిన రాఖీ పాదుకు 457 పుష్పాలు పూశాయి. ఆదివారం ఇదే పాదుకు ఏకంగా అంతకుమించి పుష్పాలు పూశాయి.

ఇవి కూడా చదవండి

అయిదేళ్లుగా పెంచుతున్న ఈ మొక్క గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో విరగబడి పువ్వులను పుష్పించలేదు. అలాంటిది కేవలం రెండు రోజుల వ్యవధిలోనే విపరీతంగా పుష్పాలు పూయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కనుల విందు చేసింది. పాదును పెంచుకున్న వెంకటేశ్వరరావు, ఉమా మహేశ్వరి దంపతుల ఆనందానికైతే అవధుల్లేవు. ఈ పుష్పాలను చూడడానికి పక్క గ్రామాల వాళ్ళుకూడా వచ్చారంటే ఏ స్థాయిలో ఆనందాన్ని పంచాయో అర్దం చేసుకోవచ్చు. అయితే ఇన్ని రాఖీ పువ్వులు వృధా కాకుండా వెంకటేశ్వరరావు, ఉమా మహేశ్వరి దంపతులు వీటితో శివపూజ చేయడం విశేషం.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..