Prakasam district: ఆశ్చర్యం కలిగించే ఘటన.. ప్రకాశం జిల్లాలో అరుదైన ఆవిష్కరణ

ప్రస్తుతం ఆఫ్రికాలో మాత్రమే కనిపించే... ఆస్ట్రిచ్ పక్షి ఆనవాళ్లను ఏపీలోని ప్రకాశం జిల్లాలో కనుగొన్నారు పరిశోధకులు. ఈ గూడు 41,000 సంవత్సరాల కంటే పాతది అని వారు చెబుతున్నారు. మరిన్ని డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Prakasam district: ఆశ్చర్యం కలిగించే ఘటన.. ప్రకాశం జిల్లాలో అరుదైన ఆవిష్కరణ
Ostrich Nest

Updated on: Jun 25, 2024 | 7:41 PM

ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన ఆవిష్కరణ వెలుగుచూసింది. వడోదరలోని MS విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం… యుఎస్, ఆస్ట్రేలియా, జర్మనీకి చెందిన పరిశోధకుల బృందంతో  కలిసి చేసిన పరిశోధనల్లోప్రకాశం జిల్లాలో ఓ అరుదైన పక్షి గూడును కనుకొన్నారు. వారికి కనిపించిన గూడు 41వేల ఏళ్ల క్రితం నాటి నిప్పు కోడి గూడు అని నిర్ధారించారు. గూడులో 9 నుంచి 11 గుడ్ల వరకు శిలాజాలుగా కూడా ఉన్నాయి. అదే విధంగా.. 1×1.5 మీటర్ల మేర కనుగొన్న అవశేషాల్లో దాదాపు 3వేల500 ఆస్ట్రిచ్‌ గుడ్డు పెంకులు ఉన్నాయి. ప్రపంచంలో ఇప్పటివరకు కనబడిన అత్యంత పురాతన ఉష్ట్రపక్షి గూడు ఇదేన్నది పరిశోధకుల వెర్షన్. 41వేల సంవత్సరాల క్రితం మన ఏపీలో ఆస్ట్రిచ్‌లు ఉన్నాయనడానికి దీన్ని మొదటి సాక్ష్యంగా చెప్పవచ్చు. భారతదేశంలో మెగాఫౌనా (40 కిలోల కంటే ఎక్కువ బరువున్న జంతువులు) ఎందుకు అంతరించిపోయాయో తెలుసుకునేందుకు ఈ అన్వేషణ చాలా కీలకమని పరిశోధకులు భావిస్తున్నారు. సాధారణంగా 9 నుండి 10 అడుగుల వెడల్పుతో ఉండే ఈ గూళ్ళలో.. 30 నుండి 40 గుడ్లు పొదగగలవని పరిశోధకలు చెబుతున్నారు.

ఈ పరిశోధనకు లీకీ ఫౌండేషన్ నిధులు సమకూరుస్తుంది. MSU ఆర్కియాలజీ అండ్ ఏన్షియంట్ హిస్టరీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్  దేవర అనిల్ కుమార్ ఏప్రిల్ 2023 నుండి ప్రాజెక్ట్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. కొత్తగా కనుగొన్న ఈ గూడు నుండి క్లిష్టమైన డేటాను వెలికితీయవచ్చు అని ఆయన చెబుతున్నారు. భారత ఉపఖండంలో మెగాఫౌనల్ జాతులు అంతరించిపోవడానికి గల కారణాలపై కీలక సమాచారం రాబట్టవచ్చన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..