Andhra: శభాష్ పోలీస్.! ఏం పని చేశారో తెలిస్తే మీరూ మెచ్చుకొవాల్సిందే

యువత గంజాయి మత్తుకు బానిస కాకుండా పోలీసులు గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లాలో 58 గంజాయి కేసులలో నమోదు చేసి మొత్తం 3403.753 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలు ఇలా..

Andhra: శభాష్ పోలీస్.! ఏం పని చేశారో తెలిస్తే మీరూ మెచ్చుకొవాల్సిందే
Eluru Police

Edited By: Ravi Kiran

Updated on: Oct 18, 2025 | 1:37 PM

యువత గంజాయి మత్తుకు బానిస కాకుండా పోలీసులు గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఏలూరు జిల్లాలో 58 గంజాయి కేసులలో నమోదు చేసి మొత్తం 3403.753 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి పర్యావరణ అనుకూల పద్ధతిలో ధ్వంసం అని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ ఆదేశించారు. ఈ ఆదేశాలతో ఏలూరు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్లో పట్టుకున్న గంజాయిను ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణలో భాగంగా, భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్న గంజాయిని పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ధ్వంసం చేసే కార్యక్రమంను గుంటూరు జిల్లాలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్ నిర్వహణ చేస్తుంది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్, ఏలూరు రేంజ్ ఐజీ శ్రీ జి.వి.జి. అశోక్ కుమార్ ఐపీఎస్‌ల పర్యవేక్షణలో ఏపీ ఈగల్ ఐజీ రవి కృష్ణ ఐపీఎస్, ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ లు ప్రత్యేకంగా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు.

గంజాయిని దహనం చేయడం వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. అయితే, ఈ కార్యక్రమంలో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని గంజాయిని జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సెంటర్‌‌లోని ప్రత్యేకమైన, అధునాతన యంత్రాలలో దహనం చేసే కార్యక్రమము చేపట్టారు. ఈ పద్ధతి ద్వారా దహనం చేయడం వల్ల కాలుష్యం అతి తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గంజాయిని ధ్వంసం చేయడం ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయదారులకు గట్టి హెచ్చరిక పంపినట్లు పోలీసులు భావిస్తున్నారు. యువత, ప్రజలు డ్రగ్స్, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఎవడు మమ్మీ వీడు.! 42 ఫోర్లతో 437 పరుగులు.. దెబ్బకు బౌలర్లను పేకాటాడేశాడుగా