Global Investors Summit 2023: ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. నేడు వైజాగ్‌లో మొదలైన జీఐఎస్-2023లో సీఎం జగన్ కీలక ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం జగన్ మాట్లాడుతూ.. భారతదేశంలో కీలకమైన రాష్ట్రం ఏపీ అని, 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చారని తెలిపారు. 340 పెట్టుబడులకు ప్రతిపాదనలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. వీటితో 6 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని జగన్ తెలిపారు. పెట్టుబడులకే కాదు.. ప్రకృతి అందాలకు విశాఖ నగరం నెలవని ప్రశంసించారు.
దేశంలో అత్యధిక సముద్రతీర ప్రాంతం ఉందని, ఆరు ఓడ రేవులు రాష్ట్రమంతటా విస్తరించి ఉన్నాయని, సహజ వనరులతో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు సాగుతుందని జగన్ తెలిపారు. తొలిరోజు 8.54 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు నేడు జరుగుతాయని.. మిగిలినవి రేపు జరుగుతాయని జగన్ వివరించారు.
ఏపీలో రూ.13 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు 340 ఇన్వెస్ట్ మెంట్ ప్రతిపాదనలు వచ్చినట్లు సీఎం జగన్ వెల్లడించారు. తద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..