Andhra News: బ్రిడ్జి కింద చాటుగా కూర్చున్న ముగ్గురు అబ్బాయిలు.. అనుమానం వచ్చి అటు చూడగా..

|

Mar 20, 2025 | 1:58 PM

కిక్కు కోసం కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు నిషారాయుళ్లు.. ఇప్పటివరకు గంజాయి చాక్లెట్లు, కుల్ఫీలతో యువత మత్తుకు బానిసలవడం చూశాం..! ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లో ఈజీగా దొరికే పెయిన్‌ కిల్లర్స్‌నే మత్తుమందుగా మార్చేస్తున్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.

Andhra News: బ్రిడ్జి కింద చాటుగా కూర్చున్న ముగ్గురు అబ్బాయిలు.. అనుమానం వచ్చి అటు చూడగా..
Drugs Case
Follow us on

కిక్కు కోసం కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు నిషారాయుళ్లు.. ఇప్పటివరకు గంజాయి చాక్లెట్లు, కుల్ఫీలతో యువత మత్తుకు బానిసలవడం చూశాం..! ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లో ఈజీగా దొరికే పెయిన్‌ కిల్లర్స్‌నే మత్తుమందుగా మార్చేస్తున్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ సర్కార్‌ గంజాయిని కట్టడి చేయడంతో.. మత్తుకోసం కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు నిషారాయుళ్లు. ఇదే క్రమంలో బాపట్లలో మత్తు కోసం పెయిన్ కిల్లర్ మందులను ఇంజెక్షన్ ద్వారా ఉపయోగిస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. జమ్ములపాలెం ఓవర్ బ్రిడ్జి మీద మత్తు మందు కలిపిన ఇంజెక్షన్లు తీసుకుంటున్నారనే సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసుల .ముగ్గురు యువకులను అరెస్ట్‌ చేశారు. వారికి ఆ ఇంజక్షన్లు ఎవరు విక్రయించారు ఇంకా ఎంతమంది ఉపయోగిస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరోవైపు మూడ్రోజుల క్రితం ఇలాగే.. స్టువర్టుపురం గ్రామంలో మెరుపు దాడులు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఓ మహిళను అరెస్ట్ చేశారు. ఆమె దగ్గర నుంచి దాదాపు 16వందల మత్తు ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులే టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. గంజాయిపై ఉక్కుపాదం మోపడంతో మత్తుకోసం కొంతమంది యువకులు ఇలా పెయిన్‌ కిల్లర్స్‌ను ఆశ్రయిస్తున్నారని చెబుతున్నారు పోలీసులు..

వీడియో చూడండి..

వేర్వేరు కారణాలతో మెడికల్‌ షాపులనుండి ట్యాబ్లెట్స్‌ను కొని వాటిని పొడిగా మారుస్తున్నారు. ఆ పొడిని ఇతర లిక్విడ్స్‌లో కలిపి ఇంజక్షన్‌ రూపంలో తీసుకుంటున్నారని వివరిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..