Gurukul School: గురుకుల పాఠశాలలో దారుణం.. ముగ్గురు విద్యార్థులను కాటేసిన పాము.. ఓ విద్యార్థి మృతి

|

Mar 04, 2022 | 12:58 PM

Gurukul School: విజయనగరం జిల్లా(vizianagaram District)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల(APRS School (Boys))లో పాము కలకలం

Gurukul School: గురుకుల పాఠశాలలో దారుణం.. ముగ్గురు విద్యార్థులను కాటేసిన పాము.. ఓ విద్యార్థి మృతి
Snake At Gurukul
Follow us on

Gurukul School: విజయనగరం జిల్లా(vizianagaram District)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కురుపాం మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల(APRS School (Boys))లో పాము కలకలం సృష్టించింది. హాస్టల్‌లో రాత్రి నిద్రిస్తున్న విద్యార్థులను పాముకాటేసింది. ఎనిమిదవ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులను పాము కాటేసింది. పాము కాటుకు గురైన విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వెంటనే విద్యార్థులను స్థానికంగా ఉండే తిరుమల హాస్పిటల్ లో చేర్పించారు. అయితే రంజిత్ కుమార్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

పాము కాటుతో విద్యార్థి మృతి చెందడంతో పేరెంట్స్‌ కన్నీరుమున్నీరు అవుతున్నారు. అటు ఈ ఘటనపై విద్యార్థులను పరామర్శించారు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి పై వైద్యులతో మాట్లాడారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలి: చంద్రబాబు: 

ఇదే విషయంపై  టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. పాముకాటుతో విద్యార్ధి మృతి బాధాకరమని.. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పారు. భరోసా కల్పించాలని చంద్రబాబు కోరారు. అంతేకాదు తనకు విజయనగరం జిల్లా కురుపాంలోని ప్రభుత్వ వసతిగృహంలోని విద్యార్ధి పాము కాటుకు గురై మృతి చెందడం ఆందోళనకు గురి చేసిందని అన్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కలిగిన విద్యార్ధులు.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గతంలో వసతి గృహాల్లో ఉండే వసతి సదుపాయాలు, ఉపాధ్యాయుల పర్యవేక్షణ చూసి.. సీట్ల కోసం ముందుకొచ్చిన విద్యార్ధులు.. ఈ రోజు ప్రాణాలతో ఉండాలంటే వసతి గృహాల్లో చేరకుండా ఉంటే మేలు అనే పరిస్థితికి జగన్ రెడ్డి దిగజార్చారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాల్సిన వసతి గృహాల్లో సదుపాయాల లేమి, భద్రత లేమి చూసి విద్యార్ధులు, తల్లిదండ్రులు భయపడే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. కురుపాంలో జరిగిన ఘటనకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని చెప్పారు.

Also Read:

మీ పిల్లలు ఎక్కువ సమయం టీవీ చూస్తున్నారా ? అయితే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాల్సిందే..

ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ఆగాలని.. ప్రపంచ శాంతి కోరుతూ విదేశీయులు పుట్టపర్తిలో ప్రత్యేక హోమం