Road Accident
Chittoor Road Accident: సంక్రాంతి పర్వదినం రోజున ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదం (Road Accident) లో ముగ్గురు మరణించారు. దీంతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరవుతున్నాయి. రెండు ద్విచక్రవాహనాలు ఢికొని ముగ్గురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా (Chittoor District) మదనపల్లిలోని ఐదోమైలు వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వాల్మీకిపురం మండలం చింతపర్తి, మదనపల్లె మండలం కొత్తవారి పల్లెకు చెందిన వ్యక్తులు శుక్రవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్రవాహనాలు వేగంతో ఎదురెదురగా వచ్చి ఢీకొన్నాయి. దీంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో స్థానికులు వెంటనే క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఇస్మాయిల్, సిద్ధిక్, శ్రీనివాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.