AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గుర్ని ఆపిన పోలీసులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా

ఆలూరు జిల్లా పెదబయలు ఏజెన్సీ ప్రాంతంలో పోలీసుల తనిఖీల్లో ముగ్గురు నడిచే వ్యక్తులపై నిఘా పెంచగా, వారి బ్యాగుల్లో 28.710 కిలోల లిక్విడ్ గంజాయి సీజ్ అయింది. ఈ గంజాయి మార్కెట్ విలువ సుమారు రూ.14.35 లక్షలు అని అంచనా. నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Andhra: నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గుర్ని ఆపిన పోలీసులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా
Liquid Ganja Seizure
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Oct 10, 2025 | 9:51 PM

Share

అది ఏజెన్సీ ప్రాంతం.. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దుకు కాస్త దూరం.. వాస్తవానికి వాహనాలపై వెళ్లే వారిపై నిఘా ఉంటుంది.. ఎందుకంటే సరిహద్దుల్లో దాటడం.. వివిధ వస్తువులను చాటుగా తెచ్చి గుట్టుగా అమ్మేసే ఘటనలు, మద్యం స్మగ్లింగ్ కార్యకలాపాలు కోకొల్లలుగా జరిగాయి. అందుకే అనుమానం వచ్చిన చోట్ల తనిఖీలు చేస్తుంటారు పోలీసులు. సాధారణంగా నడుచుకుని వెళితే.. వారిపై అంత నిఘా ఉండదు. కానీ.. ఆ పోలీసులకు ఏదో అనుమానం కలిగింది. అనుమానాస్పదంగా ముగ్గురు వెళ్తుంటే.. వారిపై ఫోకస్ పెట్టారు. ఆపి ప్రశ్నిస్తే మాట తడబడుతుంది.. వదిలేయాలని అనుకున్నా ఎక్కడో చిన్న డౌట్..! ఇక తనిఖీలు ప్రారంభించారు. పోలీసుల అనుమానమే నిజమైంది. బ్యాగు ఓపెన్ చేస్తే.. వామ్మో.. అందులో ఉంది అసలు విషయం.

వివరాల్లోకి వెళితే.. అల్లూరు జిల్లా పెదబయలు ఏజెన్సీ… ఎస్సై రమణ తన సిబ్బందితో ఆన్ డ్యూటీలో ఉన్నారు. సీతగుంటలోని ఒడిశా బ్రిడ్జి అది. అక్కడ ముమ్మరంగా వాహనాల తనిఖీలు మొదలుపెట్టారు. వాహనాలపై నిఘా పెంచారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. ఇంతలో ఓ ముగ్గురు నడుచుకుంటూ వస్తున్నారు. కూలీల్లా కనిపిస్తున్నారు. వారిపై పోలీసుల నిఘా పడింది. వదిలేద్దామనుకొని.. కానీ ఎక్కడో చిన్న డౌట్ వచ్చి ఆపారు. ప్రశ్నించారు. చింతగరువు, రాయమామిడి జంక్షన్ గోమంగి లక్ష్మీపేట కొత్తపుట్టు, పెద్దబయలు మీదుగా పాడవ, ఒడిశా కోరాపుట్ జిల్లా వైపుగా వెళ్తున్నట్టు గుర్తించారు. అంత దూరం.. వాహనాల్లో వెళ్లాల్సింది పోయి నడుచుకొని ఎందుకు వెళ్తున్నారా అన్నది డౌట్..! ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు. ఇక.. తనిఖీలు చేయాలని నిర్ణయించుకున్నారు. వారితోపాటు ఉన్న సంచులపై పోలీసుల నిఘా వెళ్ళింది. రెండు బ్యాగులను ఓపెన్ చేయించారు. అంతే.. పోలీసులు షాక్. ఆ బ్యాగుల్లో నల్లని పదార్థం గుర్తించి బయటకు తీశారు. అదేంటో తెలుసా..? లిక్విడ్ గంజాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 28.710 కిలోల లిక్విడ్ గంజాయిని గుర్తించి సీజ్ చేశారు. పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ ఎంతో తెలుసా..? 14.35 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలుకు పంపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
పచ్చదనం కోసం రైలు ప్రయాణికుడి వినూత్న ప్రయోగం!
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
అంత పెద్ద హీరోయిన్.. ఆ ఒక్క పనితో నన్ను పట్టుకొని ఏడ్చేసింది..
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
భర్త పాదాలకు పూజలు చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎందుకో తెలుసా?
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
బస్సును ఢీకొట్టిన బండరాయి భయానక దృశ్యం..!
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
ఖరీదైన ఫేస్ వాష్‌లకు గుడ్‌బై చెప్పేయండి.. మెరిసే చర్మానికి ఇలాంటి
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
పెరగనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిరుపేదల కోసం సెస్‌ పెంపు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..
నెలకోసారి మీ బాడీకి ఇది ఇచ్చి చూడండి.. ఫలితాన్ని మీరే నమ్మరు..