Dog Bite: కాశీబుగ్గలో వీధి కుక్కల స్వైర విహారం.. ఏకకాలంలో 20 మందిపై దాడి.. తీవ్ర గాయాలు..

| Edited By: Surya Kala

Sep 26, 2023 | 11:06 AM

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద ఎక్కువవుతోంది. వీధులలో గుంపులు గుంపులుగా తిరుగుతూ కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. తాజాగా పలాస లో ఓ కుక్క 20 మందిపై దాడిచేసి తీవ్రంగా గాయపరచటంతో మున్సిపాలిటి ప్రజలు ఇపుడు కుక్కను చూస్తే చాలు వణికిపోతున్నారు. కనిపించిన ప్రతి ఒక్కరిపై కుక్కలు దాడి చేస్తున్నాయని.. కుక్కల బారిన పడకుండా సంబంధిత అధికారులు ఎటువంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. 

Dog Bite: కాశీబుగ్గలో వీధి కుక్కల స్వైర విహారం.. ఏకకాలంలో 20 మందిపై దాడి.. తీవ్ర గాయాలు..
Stray Dogs
Follow us on

శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుక్క ల బెడద ఎక్కువవుతోంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలు చేస్తున్న దాడికి భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు రోడ్డుమీదకు వెళ్లాలంలంటే ఆలోచిస్తున్నారు. తాజాగా శుక్రవారం సాయంత్రం జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని కేటీ రోడ్డులో ఓ కుక్క స్వైర విహారం చేసి రోడ్డుపై కనిపించిన వారందరిపి పై దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గతంలో మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు ప్రజలపై దాడులు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అప్పట్లో  మున్సిపాలిటీల్లోని కుక్కలను బందించి అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టడం వంటివి చేపట్టేవారు. ప్రస్తుతం కుక్కల బారిన పడకుండా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని.. దీంతో కుక్కల సంతతి భారీగా పెరిగింది.

రోడ్ల మీద వెళ్తున్న జనం, మూగజీవాలు, పశువులు వంటి వాటిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. గాయాల పాలైన బాధితులు చికిత్స నిమిత్తం కోసం ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. నడిచి వెళ్తున్నవారిపై మాత్రమే కాదు బైక్ మీద వెళ్తున్న వారి వెంటపడి కుక్కలు పిక్కలు పీకుతున్నాయి. కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే పలాస కాశీబుగ్గ జనం జంకుతున్నారు. పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారిపై కుక్కలు దాడికి పాల్పడుతుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

కుక్కల సంఖ్య పెరగకుండా మున్సిపాలిటీలు, పీహెచ్‌సీల పరిధిలో జంతు సంతాన నిరోధక కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించడానికి కావాల్సిన సదుపాయాలు కల్పించడం లేదు.  వాస్తవానికి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేసి.. రేబిస్ టీకా ఇప్పించే భాద్యత ప్రభుత్వ అధికారులపై ఉంటుంది. అయితే ఇటువంటి ఏర్పాట్లు ఏమీ జిల్లా వ్యాప్తంగా జరగడం లేదు.

వీధి కుక్కలకు టీకాలు వేయాల్సి ఉండగా అధికారులు పట్టించుకోకపోవడంతో బెడత తీవ్రమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. పైగా ఈ ఏడాది ఏప్రిల్ లో జి. సిగడం మండలం మెట్టవలసలో మంచం పై ఆడుకుంటున్న 18 నెలల చిన్నారిని కుక్క నోట కరిచి సమీప తోటల్లోకి తీసుకువెళ్లి చంపివేసిన ఘటనతో జిల్లా వాసులు కుక్కల విషయంలో మరింతగా భయాందోళనలకు గురవుతున్నారు.

పలాసలు తాజాగా శుక్రవారం జరిగిన కుక్క దాడి ఘాటనతో మున్సిపల్ అధికారులు ఉలిక్కిపడ్డారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద ఎక్కువగానే ఉందని అంగీకరిస్తూనే.. వాటిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు మున్సిపాలిటీ చైర్మన్ గిరిబాబు. కుక్కల సంతాన నియంత్రణకు ఆపరేషన్లు చేపట్టేలా త్వరలో చర్యలు చేపట్టనున్నామని చెప్పారు.

కుక్కల పట్ల ప్రజలలో అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తమన్ని మున్సిపల్ చేర్మన్ అంటున్నారు. హోటల్స్‌, రెస్టారెంట్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌, చికెన్‌, మటన్‌ సెంటర్లు వ్యర్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయడం, వీధి కుక్కల అంశంపై హోర్డింగ్స్‌, పోస్టర్స్‌, బిల్‌బోర్డ్స్‌తో ప్ర చారం చేయడం వంటివి చేపడతామoటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..