Road Accident in Kadapa: చిన్ననాటి స్నేహితులు రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతి మరణంలోనూ వీడని స్నేహబంధం..

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. కడదాకా నిన్ను అది వీడిపోదురా.. అన్నాడో సినీ కవి.. ఈ మాటను నిజం చేస్తూ ఓ చిన్ననాటి స్నేహతులు మరణంలో కూడా వీడిపోలేదు.. వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు...

Road Accident in Kadapa:  చిన్ననాటి స్నేహితులు రోడ్డు ప్రమాదంలో ఒకేసారి మృతి మరణంలోనూ వీడని స్నేహబంధం..
Follow us
Surya Kala

|

Updated on: Feb 05, 2021 | 10:12 AM

Road Accident in Kadapa:స్నేహానికన్న మిన్న లోకాన లేదురా.. కడదాకా నిన్ను అది వీడిపోదురా.. అన్నాడో సినీ కవి.. ఈ మాటను నిజం చేస్తూ ఓ చిన్ననాటి స్నేహతులు మరణంలో కూడా వీడిపోలేదు.. వారిద్దరూ చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు.. చదువు, ఆటలు ఇలా ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లేవారు.. వీరి స్నేహం అటు కుటుంబ సభ్యులకే కాదు.. చుట్టుప్రక్కల వారికీ కూడా చూడముచ్చటగా ఉండేది.. అయితే వారి స్నేహబంధం చివరికి మరణంలో కూడా వీడిపోలేదు.. రోడ్డు ప్రమాదంలో ఈ స్నేహతులను మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన కడపజిల్లా లో చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్తే..

రాజంపేట మండలం చొప్పవారిపల్లి వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్నేహితులు శివాజీ, సుబ్రహ్మణ్యం మృతి చెందారు. ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి దళితకాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం, శివాజీ, ప్రకాష్‌ అలియాస్‌ బద్రీ ముగ్గురు బైక్ పై పని నిమిత్తం రాజంపేటకి వచ్చారు. పని ముగించుకుని తిరిగి మంటపంపల్లికి బయల్దేరారు. చొప్పవారిపల్లి మలుపు వద్ద అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు.

ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివాజీ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మార్గమధ్యలోనే మరణించాడు. ప్రకాష్ ఎం సుబ్రహ్మణ్యం లను మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. అయితే తిరుపతి వెళ్తున్న మార్గంలోనే సుబ్రహ్మణ్యంకూడా మృతి చెందాడు. మరణించిన ఇద్దరు వ్యక్తులు చిన్ననాటి స్నేహితులు రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ కలిసే ప్రాణాలు వదలడం కుటుంబ సభ్యులు, మిత్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. ముగ్గురూ ఒకే ఊరికి చెందిన వారు కావడంతో మంటపంపల్లి దళితవాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు శివాజికి భార్య, మూడు నెలల కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.

Also Read:

టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్ కోసం టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య భీకర పోరు..

 విశాఖ ప్రాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు.. పంజా విరిసిన చలి.. వణుకుతున్న మన్యం వాసులు