Pulasa: గోదారికి పోటెత్తిన ఎర్ర నీరు.. వలకు చిక్కిన మొదటి పులస.. ఎన్నివేలకు అమ్ముడయిందంటే

| Edited By: Surya Kala

Jul 17, 2023 | 3:58 PM

మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానాంలో మొదలైంది. యానాంలోని గోదావరికి ఎర్ర నీరు పోటెత్త డంతో మొదటి పులస చేప లభ్యమైంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో గోదావరి నదిపై చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు రెండు కేజీలు ఉన్న మొట్టమొదటి పులస వలకి చిక్కింది. 

Pulasa: గోదారికి పోటెత్తిన ఎర్ర నీరు.. వలకు చిక్కిన మొదటి పులస.. ఎన్నివేలకు  అమ్ముడయిందంటే
Pulasa
Follow us on

సీఫుడ్ ప్రియులకు చేపలను అత్యంత ఇష్టంగా తింటారు. చేపల్లో రారాజు పులస. గోదావరికి వరద పోటెత్తుతూ ఎర్ర నీరు వస్తే చాలు గోదావరి జిల్లా వాసులు పులసల కోసం ఎదురుచూస్తారు. ఈ నేపథ్యంలో మాంసాహార ప్రియులు అత్యంత ఇష్టంగా తినే పులసల సీజన్ యానాంలో మొదలైంది. యానాంలోని గోదావరికి ఎర్ర నీరు పోటెత్త డంతో మొదటి పులస చేప లభ్యమైంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో గోదావరి నదిపై చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు రెండు కేజీలు ఉన్న మొట్టమొదటి పులస వలకి చిక్కింది.

మార్కెట్ లో చేపల విక్రయించే తల్లి కూతుర్లు నాటి పార్వతి, ఆకుల సత్యవతి లు ఈ పూలసాను రూ. 13000 కి వేలంపాటలో అత్యధిక ధరకు దక్కించుకున్నారు.  అనంతరం ఆ పులస చేపను భీమవరానికి చెందిన వ్యక్తికీ  రూ. 15 వేలకు పులస చేపను విక్రయించారు.

ఈ సంవత్సరం వరద గోదారి లేటుగా రావడంతో పులస జాడ తగ్గింది. ఇంకా చెప్పాలంటే పులస ఆలస్యంగా వలకు చిక్కింది. పులస ప్రియులు పులసల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..