Coronavirus: రాజమహేంద్రవరం కళాశాలలో కరోనా కలకలం.. 163 మందికి పాజిటివ్..

|

Mar 22, 2021 | 10:17 PM

Rajamahendravaram College: దేశమంతటా కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వేలల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. విద్యా సంస్థలు

Coronavirus: రాజమహేంద్రవరం కళాశాలలో కరోనా కలకలం.. 163 మందికి పాజిటివ్..
Follow us on

Rajamahendravaram College: దేశమంతటా కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వేలల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాలు కరోనా హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. విద్యా సంస్థలు ప్రారంభించడంతో నిత్యం వందలాది మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అవుతోంది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలు సైతం అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ పరిధిలోని ఓ కళాశాలలో కరోనా కలకలం రేపింది. ఒక్కరు ఇద్దరు కాదు.. ఆ కళాశాలలో చదువుతున్న 163 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు.

కాగా.. కళాశాలలోని వారికి గత రెండు రోజుల నుంచి వరుసగా 13, 10 మందికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. దీంతో భయపడి సోమవారం చాలామంది విద్యార్థలు పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఒక్కరోజే 140 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో డా.గౌరీశ్వరరావు వెల్లడించారు. ఇదే కళాశాలలో ఇప్పటి వరకు సుమారు 700 మంది విద్యార్థుల నమూనాలను సేకరించి కరోనా పరీక్షలు చేసినట్లు వివరించారు. అయితే.. పాజిటివ్‌ నిర్ధారణ అయిన విద్యార్థులందరినీ ఒక చోటనే ఉంచి ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా చేశామని వెల్లడించారు. నెగిటివ్‌ వచ్చిన దాదాపు 450 మందిని వేరే హాస్టల్‌లో ఉంచామని, వైద్యులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

ఇదిలాఉంటే.. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 310 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతోపాటు కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 89,4,044 కి పెరగగా.. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 7,191 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,382 యాక్టివ్‌ కేసులున్నాయి.

 

Also Read:

Petrol, Diesel Price: పెట్రోల్, డీజిల్‌పై బాదుడు.. గత ఆరేళ్లల్లో ఎంతశాతం పన్నులు పెరిగాయో తెలుసా..?

India Post: విద్యార్థులకు సువర్ణవకాశం.. అంతర్జాతీయ లేఖల పోటీకి ఆహ్వానం.. ఏం చేయాలంటే..?

Vizag Steel Privatisation : ఉక్కుపరిశ్రమలకు అవసరమయ్యే కోకింగ్ కోల్ దేశంలో తగినంత లేదు : సాయిరెడ్డికి సెంటర్ ఆన్సర్