Andhra Pradesh: విద్యుత్ వైర్లు తగిలి 13 గొర్రెలు అక్కడిక్కడే మృతి

|

May 04, 2023 | 9:31 PM

అనంతపురం జిల్లా శింగనమల మండలం వెస్ట్ నరసాపురం గ్రామంలో విషాదం చేసుకుంది. కరెంటు వైర్లు తగిలి దాదాపు 13 గొర్రెలు మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే నారాయణ స్వామి అనే వ్యక్తి తన గొర్రెలు మెపేందుకు వెళ్లారు. అయితే అక్కడ కరెంట్ తీగలు పడిపోయి ఉన్నాయి.

Andhra Pradesh: విద్యుత్ వైర్లు తగిలి 13 గొర్రెలు అక్కడిక్కడే మృతి
Sheep
Follow us on

అనంతపురం జిల్లా శింగనమల మండలం వెస్ట్ నరసాపురం గ్రామంలో విషాదం చేసుకుంది. కరెంటు వైర్లు తగిలి దాదాపు 13 గొర్రెలు మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే నారాయణ స్వామి అనే వ్యక్తి తన గొర్రెలు మెపేందుకు వెళ్లారు. అయితే అక్కడ కరెంట్ తీగలు పడిపోయి ఉన్నాయి. వాటిని గమనించకుండా వెళ్లిన 13 గొర్రెలకు ఆ వైర్లు తగలడంతో అక్కడిక్కడే చెందాయి.

దాదాపు ఒకటిన్నర లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని గొర్రెలు కాపరులు వాపోతున్నారు. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గొర్రెలు చనిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు కాకుండా ఎవరైనా మనుషులకు ఆ విద్యుత్ వైర్లు తగిలి ఉంటే పెద్ద ప్రమాదం జరగిఉండేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..