Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాకు చెందిన 12 మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబాలు వెల్లడించాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ఈ నెల 7వ తేదీన చెన్నైలోని కాశిమీడు ఫిషింగ్ హార్బర్ నుంచి 12 మంది మత్స్యకారులు ఒక బోటులో వేటకు వెళ్లారు. అలా సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు ఈ నెల 16వ తేదీ నుంచి ఎవరికీ అందుబాటులోకి రాలేదు. దాంతో ఆందోళనకు గురైన మత్స్యకారులు కుటుంబ సభ్యులు.. ఈ విషయాన్ని ఫోన్‌లో ఆంధ్రప్రదేశ్ పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి అప్పలరాజు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులంతా శ్రీకాకుళం జిల్లాలోని సిక్కోలు గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. వీరంతా ఉపాధి కోసం కొంతకాలం క్రితం చెన్నై వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గల్లంతైన వారిని రక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.
23న అల్పపీడనం..
తూర్పు-పశ్చిమ షీర్ జోన్‌లో వాయు సమ్మేళనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా బలహీనపడిందన్నారు. వాయవ్య బంగాళాఖాతంలో ఈ నెల 23వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. రానున్న రెండు రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
Also read: