Andhra Pradesh: వాళ్లంతా బతికుండగానే చనిపోయారు! అధికారిపై సస్పెన్షన్‌ వేటు

ఆ గ్రామంలో ఒకేసారి 12 మంది చనిపోయారట..! కానీ వాళ్ళు బతికే ఉన్నారు. అదేంటి చనిపోయారు అంటున్నారు.. మళ్ళీ బతికే ఉన్నారు అంటున్నారు. అని కాస్త గందరగోళంలో పడినట్లుంది కదూ? అవును.. మీకే అలా ఉంటే, మరి బతికుండగానే తమను చంపినందుకు వాళ్లు ఇంకేం అనుకోవాలి? ఎస్.. ఒకేసారి 12 మంది చనిపోయినట్టు సంతకాలు చేస్తూ అధికారి ఓటర్ లిస్ట్ నుంచి వారి పేర్లను తీసేసారు. చివరకు కలెక్టర్ ఎంక్వయిరీ వరకు ఆ పంచాయతీ వెళ్ళింది. ఆ తరువాత ఏం జరిగిందంటే....

Andhra Pradesh: వాళ్లంతా బతికుండగానే చనిపోయారు! అధికారిపై సస్పెన్షన్‌ వేటు
11 Voters Removed From Voter List As Dead In Kovvuru Village

Edited By:

Updated on: Nov 08, 2023 | 7:46 PM

అనకాపల్లి, నవంబర్‌ 8: ఆ గ్రామంలో ఒకేసారి 12 మంది చనిపోయారట..! కానీ వాళ్ళు బతికే ఉన్నారు. అదేంటి చనిపోయారు అంటున్నారు.. మళ్ళీ బతికే ఉన్నారు అంటున్నారు. అని కాస్త గందరగోళంలో పడినట్లుంది కదూ? అవును.. మీకే అలా ఉంటే, మరి బతికుండగానే తమను చంపినందుకు వాళ్లు ఇంకేం అనుకోవాలి? ఎస్.. ఒకేసారి 12 మంది చనిపోయినట్టు సంతకాలు చేస్తూ అధికారి ఓటర్ లిస్ట్ నుంచి వారి పేర్లను తీసేసారు. చివరకు కలెక్టర్ ఎంక్వయిరీ వరకు ఆ పంచాయతీ వెళ్ళింది. ఆ తరువాత ఏం జరిగిందంటే..

అది అనకాపల్లి జిల్లాలోని గ్రామం. రోలుగుంట మండలంలోని కొవ్వూరు గ్రామం. అక్కడ చాలామంది నివసిస్తూ ఉంటారు. అయితే ఓ అధికారి నిర్లక్ష్యం.. ఆ గ్రామంలోని 12 మందిని చంపేసింది. బతికున్నప్పటికీ చనిపోయినట్టు ఓటర్ రికార్డులో నమోదయింది. దీంతో ఓటర్ లిస్ట్ నుంచి వారి పేర్లు తొలగించారు. దీంతో ఆ 12 మంది ఓటు హక్కును కోల్పోయారు. విషయం తెలుసుకున్న బాధితులు అవాక్కయ్యారు. తమకు జరిగిన అన్యాయంపై బంటు రాజు అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశాడు. తమకు జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో సమర్పించాడు.

అధికారి ప్రమేయంతోనే…

ఇవి కూడా చదవండి

దీంతో ఎంక్వయిరీ చేసిన అధికారులు విచారణలో బూత్ నెంబర్ 20 లో బూత్ లెవెల్ ఆఫీసర్ ప్రభావతి నిర్లక్ష్యం ఉన్నట్టు గుర్తించారు. ఫారం సెవెన్‌లో సంతకాలు తానే పెట్టి అందరూ చనిపోయారని నిర్ధారిస్తూ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించినట్టు గుర్తించారు. ఓటర్లు ఉన్నప్పటికీ చనిపోయినట్టు ఫామ్ నమోదు చేసి వారిని జాబితా నుంచి తొలగించారు. దానికి బూత్ లెవెల్ ఆఫీసర్ గా ఉన్న ప్రభావతి సంతకం చేసినట్లు గుర్తించారు. విచారణలో అవకతవకలకు పాల్పడినట్టు నిర్ధారించిన అధికారులు కలెక్టర్కు నివేదిక సమర్పించారు.

అధికారి వివరణ ఇలా.. సస్పెన్షన్..

అయితే తన ఉద్దేశపూర్వకంగా ఆ పని చేయలేదని బీఎల్ఓ ప్రభావతి వివరణ ఇచ్చారు. చనిపోయిన వ్యక్తికి సంబంధించి సంతకాలు చేసేందుకు ఆ కుటుంబంలోని వారిని పిలిచినప్పటికీ రాకపోవడంతో ఆయా డాక్యుమెంట్లను కార్యాలయానికి సమర్పించేందుకు గడువు ముగుస్తుండడంతో తానే సంతకాలు చేసి సమర్పించినట్టు ఒప్పుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ బిఎల్ఓ ప్రభావతిని సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ఒకేసారి ఇంతమందిని ఎందుకు ఎలా తొలగించారు అనేది అధికారి వివరణ ఇచ్చినప్పటికీ.. ఒకేసారి అంత మందిని చనిపోయేలా ఎలా నిర్ధారిస్తారు అన్నది గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే బీఎల్ఓ సస్పెన్షన్ చేసిన అధికారులు ఓటర్ లిస్టులో తిరిగి ఆ 12 మంది పేర్లను చేర్చే పనిలో పడ్డారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.