
ప్రేమకు కుల, మత, ప్రాంత బేధాల్లేవు.. ఒకరినొకరు ఇష్టాపడ్డారంటే వారిద్దరి మధ్య ఇంకేం అడ్డుగోడలు ఉండవు. ఇప్పుడు కుల,మత, ప్రాంతంతో పాటు వయస్సు బేధం కూడా లేదంటున్నారు కొందరు. లేత వయస్సులోనే ఘాటు ప్రేమకు తెరదీస్తున్నారు. అట్రాక్షన్‌ను ప్రేమగా భావించి తప్పులు చేస్తున్నారు. చట్టాలపై సరైన అవగాహన లేకపోవడంతో జ్యూవనైల్ హోమ్‌కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది.
తాజాగా బాపట్లలో జరిగిన ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. బాపట్ల పట్టణంలోని రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన మైనర్ బాలిక పదో తరగతి చదువుతోంది. అదే కాలనీలో ఉండే మైనర్ బాలుడు ఆరో తరగతి వరకూ చదివి ఆ తర్వాత బడికెళ్ళడం మానేశాడు. అప్పడి నుండి డెకరేషన్ పనులు చేసేందుకు వెలుతున్నాడు. అయితే ఇద్దరూ మైనర్లది ఒకే కాలనీ కావడంతో ఇద్దరి మద్య పరిచయం ఏర్పడింది.
పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ తరుచూ మాట్లాడుకోవడం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ బాలిక లైంగికంగా మైనర్ బాలుడికి దగ్గరైంది. అయితే ఇదేమీ పట్టని వారిద్దరూ తల్లిదండ్రులు లేని సమయంలో చనువుగా మాట్లాడుకోవడం చుట్టుపక్కల వారు గమనించారు. ఆ తర్వాత ఈ విషయం బాలిక తల్లికి తెలిసింది. అయితే కూతురులో శారీరక మార్పులు గమనించిన తల్లి బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ ఆమె గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీంతో తల్లి బాలికను నిలదీయగా అదే కాలనీకి చెందిన మైనర్ బాలుడితో ప్రేమ వ్యవహారం బయటపడింది. వెంటనే బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మైనర్ బాలికను మాయమాటలతో లోబర్చుకున్న మైనర్ బాలుడిపై పోలీసులు కేసు నమోదు చేసి జ్యూవనైల్ హోంకు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..