Amalapuram: ఆయ్.. మాది కోనసీమండి.. నిశ్చితార్థ వేడుకలో కాబోయే కోడలికి 100 రకాల స్వీట్స్ సారె.. మాములుగా లేదంటున్న అతిథులు

Amalapuram: కోనసీమ(Konaseema) అనగానే అందమైన పకృతి మాత్రమే కాదు.. వారు ఇచ్చే ఆతిధ్యం కూడా గుర్తుకొస్తుంది ఎవరికైనా. గోదావరి జిల్లా (Godavari District) వాసులు అనురాగానికే కాదు..

Amalapuram: ఆయ్.. మాది కోనసీమండి.. నిశ్చితార్థ వేడుకలో కాబోయే కోడలికి 100 రకాల స్వీట్స్ సారె.. మాములుగా లేదంటున్న అతిథులు
Enguagement Funtion In Amp

Updated on: Apr 24, 2022 | 12:37 PM

Amalapuram: కోనసీమ(Konaseema) అనగానే అందమైన పకృతి మాత్రమే కాదు.. వారు ఇచ్చే ఆతిధ్యం కూడా గుర్తుకొస్తుంది ఎవరికైనా. గోదావరి జిల్లా (Godavari District) వాసులు అనురాగానికే కాదు, ఆప్యాయతకు కేరాఫ్ అడ్రస్.  గోదావరి జిల్లా వాసులు వెటకారంలోనే కాదు మమకారంలోనూ తగ్గేదెలే అంటారు గోదారోళ్లు.  ఆతిథ్యం, పండగలు, శుభకార్యాలు ఏవైనా సరే గోదావరి జిల్లాల స్పెషాలిటీనే వేరు. తాము ఇచ్చే అతిథ్యంలో అతిధులను ఆకట్టుకుంటారు. ముఖ్యంగా కోనసీమలో పండగల్లోనైనా, పంక్షన్లనోనైనా అతిధులకు ఇచ్చే ఆతిధ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక తమ ఇంటికి వచ్చే అల్లుళ్ళకు ఇచ్చే గౌరవం, కోడళ్ళకు పంపే సారే ఇవన్నీ వెరీ వెరీ స్పెషల్. తాజాగా ఓ ఇంటివారి నిశ్చితార్థ మహోత్సవానికి కళ్లు బైర్లు కమ్మే వెరైటీ స్వీట్స్ తయారు చేయించారు. అయితే తాజాగా అమలాపురంలో నిశ్చితార్ధం వేడుక సమయంలో తీసుకుని వెళ్ళిన స్వీట్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. ఈ సారె అతిధులను, ఆహుతులను ఆకట్టుకుంది

అమ్మాయి తరపువారికి 100 రకాల స్వీట్స్ తో సర్‌ప్రైజ్‌ ఇచ్చారు పెళ్లికొడుకు తరుపు వారు. రకరకాల పళ్ళు రూపంలో ఈ స్వీట్స్‌ తయారు చేయించారు. కోనసీమ జిల్లాలోని అమలాపురంలోని పూటి వారింటి కుమారుడి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. సిద్దంశెట్టి వారింటి పెళ్లి కుమార్తెకు గుర్తుండిపోయేలా కానుకలు సమర్పించారు. ఈ వేడుక కోసం అమలాపురంలోని స్తానిక స్వీట్ స్టాల్ లో సుమారు 100 రకాల ఫ్రూట్స్ రూపంలో స్వీట్స్ తయారు చేయించారు. పెళ్ళి కుమార్తెకు పెట్టే సారెగా తీసుకెళ్లారు పెళ్లికొడుకు బంధువులు.

 

Also Read: ప్రియాంక గాంధీ నుండి ఆ పెయింటింగ్‌ను రూ.2కోట్లకు బలవంతంగా కొనిపించారు.. ED ఛార్జిషీట్‌లో రాణా కపూర్

Viral Video: కదులుతున్న వాహనం నుండి దూకిన వ్యక్తి.. షాకింగ్, డేంజరస్ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్