
సముద్రంలో ఎన్నో రకాల మిస్టరీలను దాచిపెడుతుంది. కొన్నిసార్లు ఆయా మిస్టరీలు ఒడ్డుకు చేరుకుంటుండటంతో.. జనాలు తెగ ఆసక్తిని కనబరుస్తారు. సరిగ్గా ఇలాంటి ఓ ఆసక్తికర సంఘటన విశాఖపట్నంలో జరిగింది. ఇంతకీ అసలు దానికి సంబంధించిన స్టోరీ ఏంటి.? వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.?
వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్టణం తీరానికి కొట్టుకొచ్చిన ఓ పెద్ద పురాతన పెట్టె పోలీసులకు మిస్టరీగా మారింది. తీరానికి సెప్టెంబర్ 29న ఓ పెద్ద పురాతన పెట్టె కొట్టుకు వచ్చిందన్న వార్త స్థానికంగా వైరల్ అయింది. దానిని చూసేందుకు వందల సంఖ్యలో జనాలు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం జనంతో కిటకటలాడింది. ఆ పెట్టెలో విలువైన సంపద ఏదో ఉండే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది. మరోవైపు లంగర్ వేసే సమయంలో జెట్టీలను ఢీ కొట్టకుండా వాడే చెక్క దిమ్మె అయి ఉంటుందని కొందరంటున్నారు.
వైఎంసీఏ బీచ్‌లోకి పెట్టె కొట్టుకు వచ్చిందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని దానికి కాపలాగా ఉన్నారు. పెట్టెను ఎవరూ ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పురావస్తుశాఖ అధికారులు వచ్చి పెట్టెను తెరిచే అవకాశం ఉందని, వారికి ఇప్పటికే సమాచారం అందించినట్టు తెలిపారు. ఇంత భారీ పెట్టె సముద్ర తీరానికి కొట్టుకురావడం ఇదే తొలిసారని స్థానికులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం ఆ పెట్టె దగ్గరకు డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ కూడా వచ్చారు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందన్నది మాత్రం అధికారులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. చూడాలి మరికొద్ది రోజుల్లో ఈ మిస్టరీ ఎంతవరకు సాల్వ్ అవుతుందో.?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..