Andhra Pradesh: అందుకే బాబు జైలుకెళ్లారు.. సజ్జల సంచలన కామెంట్స్..
Amaravati, September 30: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబని కామెంట్ చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం దోచుకున్నారని విమర్శించారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన సజ్జల.. 4 కేసుల్లో చంద్రబాబు అండ్ టీంపై పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారాయన.
Amaravati, September 30: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. లక్ష మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబని కామెంట్ చేశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం దోచుకున్నారని విమర్శించారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన సజ్జల.. 4 కేసుల్లో చంద్రబాబు అండ్ టీంపై పూర్తి ఆధారాలు ఉన్నాయని వెల్లడించారాయన. ఆధారాలను సీఐడీ కోర్టు ముందు ఉంచిదని..ఇందులో రాజకీయ కక్షకు అవకాశం లేదని సజ్జల స్పష్టం చేశారు.
స్కిల్ స్కాం కేసులో పూర్తి ఆధారాలతోనే సీఐడీ చంద్రబాబును కోర్టు ముందు ప్రవేశ పెట్టిందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ 20 రోజుల్లో లోకేశ్ ముఠా నానా యాగీ చేసిందన్నారు. ప్రజలకు సంబంధించిన సొమ్ము దోపిడీకి గురైందని సజ్జల వివరించారు. సాక్ష్యాధారాలతో దొరికితే కోర్టు రిమాండ్‌కు పంపిందని గుర్తు చేసారు. జరిగిన స్కామ్ పైన వీరంతా మాట్లాడటం లేదన్నారు. దొంగతనం చేసి సానుభూతి కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్ ను దేశ సమస్యలా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు సజ్జల. చంద్రబాబుపై కక్షసాధింపు చేయాల్సిన అవసరం లేదన్నారు సజ్జల. బాబు అరెస్టుపై రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చారని..త్వరలో ఐక్యరాజ్యసమితికి వినతిపత్రం ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లదేని ఆయన ఎద్దేవా చేశారు.
ఇకపోతే చంద్రబాబు ఇప్పటివరకు స్టేలు తెచ్చుకొని బ్రతికారని ఎద్దేవా చేశారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. స్కిల్ స్కాంలో కూడా తప్పించుకోవాలని ప్రయత్నించాడని..కానీ కుదరలేదని విమర్శించారు. బెయిల్‌పై బయటకు వచ్చి సానుభూతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు మంత్రి బొత్స.