Watch Video: మల్లారెడ్డితో మామూలుగా ఉండదు మరి.. మాస్ స్టెప్పులతో దుమ్మురేపిన మంత్రి..

Watch Video: మల్లారెడ్డితో మామూలుగా ఉండదు మరి.. మాస్ స్టెప్పులతో దుమ్మురేపిన మంత్రి..

Shiva Prajapati

|

Updated on: Sep 30, 2023 | 11:34 AM

Minister Malla Reddy Dance: ఎనర్జీలో నాకెవ్వరు సాటి లేరు.. డ్యాన్స్‌లో నాకెవ్వరు పోటీ లేరు అంటున్నారు మంత్రి మల్లారెడ్డి. 5K రన్‌లో మాస్ స్టెప్పులతో డ్యాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు మంత్రి. ఒకసారి ఆయన ఎనర్జీ లెవల్స్ చూస్తే 16 ఏళ్ల యువకులు కూడా బలాదూర్ అనాల్సిందే. కుర్రకారు యువకులు కూడా డ్యాన్స్‌లో తనతో పోటీ పడలేరన్నట్లుగా రెచ్చిపోయారు మంత్రి మల్లారెడ్డి.

Hyderabad, September 30: ఎనర్జీలో నాకెవ్వరు సాటి లేరు.. డ్యాన్స్‌లో నాకెవ్వరు పోటీ లేరు అంటున్నారు మంత్రి మల్లారెడ్డి. 5K రన్‌లో మాస్ స్టెప్పులతో డ్యాన్స్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు మంత్రి. ఒకసారి ఆయన ఎనర్జీ లెవల్స్ చూస్తే 16 ఏళ్ల యువకులు కూడా బలాదూర్ అనాల్సిందే. కుర్రకారు యువకులు కూడా డ్యాన్స్‌లో తనతో పోటీ పడలేరన్నట్లుగా రెచ్చిపోయారు మంత్రి మల్లారెడ్డి. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో 5k వాకథాన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి మల్లారెడ్డి. ఈ సందర్భంగా వైద్యులు, యువతతో కలిసి డ్యాన్స్ చేసి ఉత్సాహపరిచారు. మత్తు పదార్థాలకు బానిసై యువత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు మంత్రి మల్లారెడ్డి. యువత డ్రగ్స్ వీడి హెల్త్‌పై ఫోకస్ పెంచాలన్నారు. నిత్యం వ్యాయామం, యోగా చేస్తున్న కారణంగానే 70 ఏళ్ల వయసులోనూ ఇలా ఆరోగ్యంగా ఉన్నానన్నారు మల్లారెడ్డి.

Published on: Sep 30, 2023 11:04 AM