అప్పుడే ఆ రైల్వేస్టేషన్‌లోకి ఓ ట్రైన్ వచ్చి ఆగింది. ప్లాట్ ఫామ్‌పై వేచి చూస్తున్న ప్రయాణీకులు అంతా కూడా వచ్చిన రైలులోకి ఎక్కేందుకు సిద్దమవుతున్నారు. అంతే! ఇంతలో ఒక్కసారిగా బూట్ల చప్పుడు మారుమ్రోగింది. ఆర్‌పీఎఫ్ పోలీసులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది ఓ స్లీపర్ కోచ్ వైపు పరుగులు పెట్టారు. ఇక అందులో నుంచి దిగుతోన్న ప్రయాణీకులు ఒక్కొక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. 10 మంది వ్యక్తులపై అనుమానం వచ్చింది. కట్ చేస్తే.. వారి బ్యాగులు చెక్ చేయడంతో గంజాయి వాసన గుప్పుమంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో సమీపాన ఉన్న ముదిగుబ్బ రైల్వే స్టేషన్‌లో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న 10 మంది వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆర్‌పీఎఫ్ పోలీసులు, సెబ్ అధికారులు. పక్కా సమాచారం మేరకు ఓ ట్రైన్ రాగానే రైడ్ చేసిన పోలీసులు స్లీపర్ బోగీ నుంచి దిగుతోన్న 10 మంది వ్యక్తుల దగ్గర నుంచి 18 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గణేష్, నగేష్ అనే వ్యక్తులు రెండు గ్రూపులుగా విడిపోయి.. ఈ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరందరూ కూడా తునిలో మిధున్ గ్యాంగ్ దగ్గర నుంచి ఒక్కొక్క కేజీ రూ. 3 వేలకు చొప్పున కొనుగోలు చేసి.. వేరొక బృందానికి రూ. 6 వేలకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా, గంజాయి అక్రమ రవాణా చేస్తోన్న ముఠా దగ్గర నుంచి 36 కేజీల గంజాయి, రూ. 36 వేల నగదు సీజ్ చేశారు పోలీసులు. అలాగే నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
శ్రీ సత్య సాయి జిల్లా, ముదిగుబ్బ స్టేషన్ పరిది లో గంజాయి కేసు లో అరెస్ట్ చేసిన నిందితులను జిల్లా అదనపు ఎస్పీ కేవీ రామకృష్ణ ప్రసాద్ గారు మీడియా ముందు ప్రవశపెట్టారు @APPOLICE100 #ssspolice#Andhrapradeshpolice#sssdistrict pic.twitter.com/EYIeKalqIE
— SSSPOLICE (@SSSPOLICE12) February 9, 2023