AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కొండచిలువే.. కానీ రక్తపింజర లాంటి దూకుడు.. వీడియో చూస్తే షాకే..

విజయనగరం జిల్లా రేగిడి మండలం బూరాడ జంక్షన్‌ సమీపంలో పది అడుగుల భారీ కొండచిలువ కలకలం రేపింది. ప్రధాన రహదారిపై సంచరించి పశువుల పాకలోకి వెళ్లిన కొండచిలువను స్నేక్ క్యాచర్ రమణయ్య సురక్షితంగా పట్టుకుని జనావాసాలకు దూరంగా విడిచిపెట్టారు. .. ..

Andhra: కొండచిలువే.. కానీ రక్తపింజర లాంటి దూకుడు.. వీడియో చూస్తే షాకే..
Python Rescue
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Oct 27, 2026 | 5:41 PM

Share

విజయనగరం జిల్లాలో భారీ కొండచిలువ కలకలం రేపింది. రేగిడి మండలం బూరాడ జంక్షన్‌ సమీపంలోని ప్రధాన రహదారిపై సుమారు పది అడుగుల పొడవున్న కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై కొండచిలువ సంచరించడంతో వాహనదారులు అప్రమత్తమయ్యారు. దాని కదలికలను గమనిస్తూ జాగ్రత్తగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపు రోడ్డుపై సంచరించిన కొండచిలువ.. అనంతరం సమీపంలోని పశువుల పాకలోకి ప్రవేశించింది. దీంతో పశువులకు ప్రమాదం వాటిల్లుతుందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. కొండచిలువను చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు సందడి నెలకొంది.

ఈ క్రమంలో స్థానికులు స్నేక్ క్యాచర్ రమణయ్యకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన కొండచిలువను పట్టుకునేందుకు ప్రయత్నించారు. తొలుత దూకుడుగా చిక్కకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, ఎట్టకేలకు దానిని సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం జనావాసాలకు దూరంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి విడిచిపెట్టారు. దీంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

పాములు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి

ప్రధాన రహదారులపై లేదా జనావాసాల సమీపంలో పాములు కనిపించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్నేక్ క్యాచర్ సూచిస్తున్నారు. వాటిని పట్టుకునేందుకు స్వయంగా ప్రయత్నించకుండా, వాటికి దూరంగా ఉండాలని, వెంటనే నిపుణులకు సమాచారం అందించాలని చెబుతున్నారు. బూరాడ జంక్షన్‌ సమీపంలో పది అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. స్నేక్ క్యాచర్ సకాలంలో స్పందించి దానిని సురక్షితంగా తరలించడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోలేదు.

Follow Us