Narsipatnam: పార్క్ చేసిన బైక్‌పై అనుమానాస్పదంగా సంచి.. ఓపెన్ చేసి చూడగా షాక్..
ఆయన ఆర్టీసీ కాంప్లెక్స్ లో బైక్ పార్క్ చేశారు. తిరిగి వచ్చేసరికి బైక్‌పై ఓ సంచి ఉంది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. దీంతో కాసేపటి తర్వాత లోపల ఏముందా అని చూడగా.. ఓ జీన్స్ ప్యాంటుతో పాటు కరెన్సీ కట్టలు కనిపించాయి...

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దొంగ నోట్ల కలకలం చెలరేగింది. ఆర్టీసీ కాంప్లెక్స్ లో బైక్‌పై సంచి అనుమానాస్పదంగా కనిపించింది. బైక్ యజమాని సాంబశివరావు తొలుత ఆ సంచి ఎవరైనా ప్రయాణీకులు పెట్టారేమో అనుకున్నాడు. ఎంతసేపు చూసినా ఎవరూ రాలేదు. దీంతో కంగారు వచ్చి సంచిని ఓపెన్ చేశాడు. లోపల్ జీన్ ప్యాంటుతో పాటు ఐదువందల నోట్ల కట్టలు కనిపించాయి. లెక్కించగా లక్ష అమౌంట్ ఉంది. నోట్ల కట్టలతో బ్యాగును సాంబశివరావు పోలీసులకు అందజేశాడు. పోలీసులు వాటిని పరిశీలించి దొంగ నోట్లుగా నిర్ధారించారు. సంచి బైక్‌పై పెట్టిన ఆగంతకుడు కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. దొంగ నోట్ల ముఠా పనా లేక.. ఎవరైనా ఆకతాయిలు ఇలా చేశారా అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
మాములుగా అయితే పిల్లలు ఆడుకునే తరహా నోట్లు అయితే వాటిపై చిల్డ్రన్ బ్యాంకు అని రాసి ఉంటుంది. కానీ వీటిపై అలా ఏం రాసి లేదు. దీంతో ఇది పక్కాగా దొంగ నోట్ల బ్యాచ్ పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులను చూసి ఎవరైనా భయపడి అక్కడ పెట్టి వెళ్లారా..? లేక వేరే ఎవరికైనా అక్కడికి వచ్చి బ్యాగు మర్చిపోయారా అనేది పోలీసుల విచారణలో తేలనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
