Snow Squall: అమెరికా(America) లోని పెన్సిల్వేనియాలోని ఇంటర్‌స్టేట్ హైవేపై సోమవారం భారీగా మంచు (Snow) కురిసింది. రహదారులన్నీ దట్టమైన మంచు దుప్పటి కప్పుకున్నాయి. దీంతో రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రహదారిపై మంచు కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఒకదాని కొకటి 50 నుంచి 60 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. హైవేపై ఢీకొన్న వాహనాలలో ట్రక్కులు, ట్రాక్టర్-ట్రైలర్లు , కార్లతో సహా అనేకం ఉన్నట్లు స్థానిక పోలీసులు చెప్పారు. క్రాష్ తర్వాత కొన్ని వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. తరువాత వాటిని ఆర్పివేశారు.
యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రహదారిపై మంచు కప్పబడి ఉండడంతో.. వాహనదారులు నియంత్రణ కోల్పోవడంతో ఒకదానితో ఒకటి ఢీ కొన్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలో దిగిన అధికారులు చర్యలు చేపట్టారు. హైవేపై ఉన్న మంచును తొలగించేందుకు చర్యలు తీసుకున్నారు. భారీగా వాహనాలు రహదారిపై ఉండడంతో హైవేపై కొన్ని మైళ్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సంఘటన స్థలానికి రెస్క్యూ టీమ్, పోలీసులు చేరుకోవడానికి కొంచెం కష్టతరమైంది. ఇలాంటి ఘటన జరగడం ఒకే నెలలో ఇది రెండోసారి అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Ugadi 2022: శుభప్రద ఉగాది కోసం తెలంగాణా సర్కార్ ఏర్పాట్లు.. వేడుకల్లో పాల్గొననున్న సీఎం కేసీఆర్
Chanakya Niti: జీవితంలో సక్సెస్, సుఖ, సంతోషాలు మీ సొంతం కావాలంటే.. ఈ 5 విషయాలు పాటించమంటున్న చాణక్య