US Shooting: అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ.. నూతన సంవత్సర వేడుకల్లో ముగ్గురు మృతి..

Mississippi Shooting: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. రోజురోజుకూ గన్ కల్చర్ పెచ్చుమీరుతోంది. తాజాగా.. న్యూ ఇయర్ పార్టీలో తుపాకులు పేలాయి. ఈ ఘటనలో

US Shooting: అమెరికాలో మళ్లీ పేలిన తుపాకీ.. నూతన సంవత్సర వేడుకల్లో ముగ్గురు మృతి..
Us Shooting

Updated on: Jan 02, 2022 | 9:31 AM

Mississippi Shooting: అగ్రరాజ్యం అమెరికాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. రోజురోజుకూ గన్ కల్చర్ పెచ్చుమీరుతోంది. తాజాగా.. న్యూ ఇయర్ పార్టీలో తుపాకులు పేలాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిసిసిపీ గల్ఫ్‌పోర్ట్ న్యూఇయర్ వేడుకల్లో దుండగులు కాల్పులతో తెగబడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మిసిసిపీ గల్ఫ్‌పోర్ట్‌లో నూతన సంవత్సర వేడుకల్లో.. దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారిని.. వారికోసం వెతుకుతున్నట్లు మిసిసిపి పోలీసులు తెలిపారు. 50 బుల్లెట్ల వరకు కాల్పుల్లో వినియోగించినట్లు ప్రాథమికంగా వెల్లడించారు.

అయితే.. ఇప్పటివరకు ఎవ్వరిని అరెస్ట్ చేయలేదని.. నిందితుల కోసం గాలిస్తున్నట్లు గల్ఫ్‌పోర్ట్ పోలీస్ చీఫ్ క్రిస్ రైల్ తెలిపారు. గాయపడిన వారికి చికిత్స అందుతున్నట్లు వెల్లడించారు. న్యూఇయర్ ప్రారంభానికి 2 నిమిషాల ముందు ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read:

Dry Cough Remedies: పొడి దగ్గుతో బాధపడుతున్నారా..? అయితే టిప్స్ పాటిస్తే వెంటనే ఉపశమనం..

Smoking: కొత్త ఏడాదిలో స్మోకింగ్‌ మానేయాలని డిసైడ్‌ అయ్యారా.? అయితే మీకు ఈ యాప్స్‌ హెల్ప్‌ చేస్తాయి..