United States Debt Ceiling: ఊపిరి పీల్చుకున్న అమెరికా.. తప్పిన దివాలా ముప్పు

|

Jun 04, 2023 | 2:30 PM

అమెరికాకు దివాలా ముప్పు తప్పింది. అప్పుల పరిమితి పెంపునకు సంబంధించిన కీలక బిల్లుకి అక్కడి ఉభయ సభల ఆమోదం లభించింది. ప్రతినిధుల సభలో బిల్లు నిన్న గట్టెక్కగా.. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సెనేట్‌ కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో అప్పుల పరిమితి పెంచుకునేందుకు..

United States Debt Ceiling: ఊపిరి పీల్చుకున్న అమెరికా.. తప్పిన దివాలా ముప్పు
Joe Biden
Follow us on

అమెరికాకు దివాలా ముప్పు తప్పింది. అప్పుల పరిమితి పెంపునకు సంబంధించిన కీలక బిల్లుకి అక్కడి ఉభయ సభల ఆమోదం లభించింది. ప్రతినిధుల సభలో బిల్లు నిన్న గట్టెక్కగా.. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సెనేట్‌ కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో అప్పుల పరిమితి పెంచుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం లాంఛనమే కాబట్టి బిల్లు వెంటనే చట్టరూపం దాల్చనుంది.

2021 నాటికి అమెరికన్‌ ప్రభుత్వం తీసుకున్న అప్పు 28.5 లక్షల కోట్ల డాలర్లకు అంటే రూ.23,53,09,680 కోట్లు చేరింది. యూఎస్‌ జీడీపీ కంటే ఇది 24 శాతం ఎక్కువ. ఇందులో ఎక్కువ మొత్తం దేశీయంగా వ్యక్తులు, సంస్థల నుంచి సేకరించగా.. దాదాపు 7 లక్షల కోట్ల డాలర్లను విదేశాల నుంచి సేకరించారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వ అప్పుల పరిమితి 31.4 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ పరిమితిని సైతం దాటి అప్పులు చేయడానికి బైడెన్‌ ప్రభుత్వం కాంగ్రెస్‌ అనుమతి కోరింది. కానీ, ప్రతినిధుల సభలో ఏకకుక్వగా ఉన్న రిపబ్లికన్లు అప్పు పరిమితి పెంచేందుకు ముందు ఒప్పుకోలేదు. దీంతో గతకొంత కాలంగా ఆందోళన కొనసాగింది.

ఈ నేపధ్యంలో అమెరికా రుణ గరిష్ఠ పరిమితి పెంపుపై అధ్యక్షుడు జో బైడెన్‌, స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు గత శనివారం ఇరు పక్షాల మధ్య రాజీ కుదరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రెండేళ్లపాటు అప్పుల పరిమితి పెంపు, వ్యయ నియంత్రణపై సెనేట్‌లోని డెమోక్రాట్లు, ప్రతినిధుల సభలోని రిపబ్లికన్లు సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చి బిల్లుకు ఆమోదం తెలిపారు.

ఇవి కూడా చదవండి


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి