TANA: తానాలో పతాక స్థాయికి ఆధిపత్య పోరు.. సై అంటే సై అంటోన్న అంజయ్య, యార్లగడ్ల వర్గాలు..

|

Jul 01, 2022 | 10:34 PM

TANA: ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (TANA) లో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ఫౌండేషన్ అధ్యక్షుడు

TANA: తానాలో పతాక స్థాయికి ఆధిపత్య పోరు.. సై అంటే సై అంటోన్న అంజయ్య, యార్లగడ్ల వర్గాలు..
Tana
Follow us on

TANA: ప్రపంచంలోనే అతి పెద్ద తెలుగు సంఘంగా గుర్తింపు పొందిన తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (TANA) లో ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ఫౌండేషన్ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకటరమణ వర్గాలు సై అంటే సై అంటున్నాయి. గురువారం రాత్రి అంజయ్య చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన తానా ఫౌండేషన్ సమావేశంలో యార్లగడ్డ వెంకటరమణను ఫౌండేషన్ చైర్మన్ పదవి నుంచి పోలవరపు శ్రీకాంత్ ను కోశాధికారి పదవి నుంచి తొలగిస్తూ తీర్మానించారు. తానా ఫౌండేషన్ లో పదిహేను మంది సభ్యులకు గాను ఎనిమిది మంది సభ్యులు ఈ నిర్ణయాన్ని సమర్థించారు. మరోవైపు ఈ సమావేశాన్ని యార్లగడ్డ వర్గం బహిష్కరించింది.

ఫౌండేషన్ నూతన ఛైర్మన్ గా..
ప్రస్తుతం తానా ఫౌండేషన్ కార్యదర్శిగా ఉన్న శశికాంత్ ను ఫౌండేషన్ ఛైర్మన్ గా విద్యా గారపాటినీ కార్యదర్శిగా, కోశాధికారిగా వినయ్ మద్దినేని నియమిస్తూ అంజయ్య వర్గం తీర్మానించింది. మరొక పక్క యార్లగడ్డ వర్గం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. న్యాయ పోరాటానికి సిద్ధమైంది. చట్ట ప్రకారం అంజయ్య వర్గం నిర్వహించిన సమావేశం చెల్లదని, ఈ సమావేశం నిర్వహించవద్దని ముందుగానే అటార్నీ ద్వారా నోటీసులు పంపించారు. తానా లో నెలకొన్న ఈ వర్గాల కుమ్ములాటలు ఎక్కడికి దారితీస్తాయో అని సభ్యులందరూ ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. మరోవైపు తానా నిబంధనల్లో అవిశ్వాస తీర్మానం లేదని కాబట్టి అది చెల్లదని బైలాస్‌ అధికారి ఉప్పులూరి సుబ్బారావు ఛైర్మన్ యార్లగడ్డ వెంకటరమణకు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి