అమెరికాలో తెలుగు యువకుడు మృతి..!

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. నార్త్ కరోలినాలో జిమ్‌కు వెళ్తున్న సాహిత్ రెడ్డిని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో గంట సేపు ప్రాణాలతో పోరాడి చివరకు మృతి చెందాడు. సాహిత్‌ రెడ్డిది హైదరాబాద్‌లోని విద్యానగర్. సీబీఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి 2016లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. ఓ కన్సల్టెన్సీలో జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో సాహిత్ రెడ్డి ఇలా దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు […]

అమెరికాలో తెలుగు యువకుడు మృతి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: May 14, 2019 | 6:35 PM

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. నార్త్ కరోలినాలో జిమ్‌కు వెళ్తున్న సాహిత్ రెడ్డిని గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో గంట సేపు ప్రాణాలతో పోరాడి చివరకు మృతి చెందాడు. సాహిత్‌ రెడ్డిది హైదరాబాద్‌లోని విద్యానగర్. సీబీఐటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి 2016లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. ఓ కన్సల్టెన్సీలో జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో సాహిత్ రెడ్డి ఇలా దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.