AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో రెండో డిబేట్ రద్దు, ఇక ఈ నెల 22 నే !

అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్, జో బైడెన్ మధ్య జరగాల్సిన రెండో దఫా డిబేట్ రద్దయింది. ఈ విషయాన్ని అధ్యక్ష డిబేట్ల కమిషన్ ప్రకటించింది. వీరిద్దరి మధ్య సెకండ్ ముఖాముఖి ఈ నెల 15 న జరగాల్సి ఉంది.

అమెరికాలో రెండో డిబేట్ రద్దు, ఇక ఈ నెల 22 నే !
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 10, 2020 | 10:12 AM

Share

అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్, జో బైడెన్ మధ్య జరగాల్సిన రెండో దఫా డిబేట్ రద్దయింది. ఈ విషయాన్ని అధ్యక్ష డిబేట్ల కమిషన్ ప్రకటించింది. వీరిద్దరి మధ్య సెకండ్ ముఖాముఖి ఈ నెల 15 న జరగాల్సి ఉంది. అయితే ఇద్దరూ వేర్వేరు తేదీలను ప్రకటించినందున. ప్రత్యామ్నాయ ప్లాన్లను పేర్కొన్న కారణంగా రెండో డిబేట్ రద్దు చేసినట్టు ఈ కమిషన్ వెల్లడించింది. ఇక ఈ నెల 22 న టేనేసీ లో దీన్ని నిర్వహించనున్నారు. 1976 నుంచి ప్రతి అధ్యక్ష ఎన్నికకు ముందు ఈ విధమైన ముఖాముఖి కార్యక్ర మాలను నిర్వహిస్తూ వస్తున్నారు. జో బైడెన్ అడిగే ప్రశ్నలకు భయపడి ట్రంప్ తన తేదీని మార్చుకున్నారని బైడెన్ వర్గీయులు విమర్శిస్తున్నారు.వచ్ఛే నెల 3 న ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్ జరగనుంది.