PM Modi US Visit: న్యూయార్క్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం.. యోగా డే కార్యక్రమంలో నేడు ఫుల్ బిజీ షెడ్యూల్..

|

Jun 21, 2023 | 3:11 AM

PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లోని జేకేఎఫ్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రధాని జూన్ 23 వరకు అమెరికా పర్యటనలో ఉంటారు.

PM Modi US Visit: న్యూయార్క్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం.. యోగా డే కార్యక్రమంలో నేడు ఫుల్ బిజీ షెడ్యూల్..
Pm Modi
Follow us on

PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లోని జేకేఎఫ్ విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ప్రధాని జూన్ 23 వరకు అమెరికా పర్యటనలో ఉంటారు. ఈ సందర్భంగా ఐరాసలో జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొనడంతోపాటు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో కలిసి విందు కూడా చేయనున్నారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన పూర్తి షెడ్యూల్‌ ఓసారి చూద్దాం.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని అమెరికా చేరుకున్నారు. ప్రధానమంత్రి పర్యటన గురించి US NSC కోఆర్డినేటర్ ఆఫ్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ జాన్ కిర్బీ మాట్లాడుతూ, ఈ పర్యటన రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను ధృవీకరిస్తుందని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. భారతీయులతో మేం సురక్షితమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని విశ్వసిస్తున్నాం. కాబట్టి ఇరుదేశాల రక్షణ సహకారాన్ని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ అమెరికా పర్యటన పూర్తి షెడ్యూల్..

ప్రధాని మోదీ జూన్ 20 నుంచి 25 వరకు అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటనకు వెళ్లారు. జూన్ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. యోగా డే కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ జూన్ 22న వాషింగ్టన్ డీసీకి వెళ్లనున్నారు. అక్కడ వైట్ హౌస్ వద్ద ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలుకుతారు.

అధ్యక్షుడు జో బిడెన్‌తో కలిసి విందు..

ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో భేటీ కానున్నారు. అధ్యక్షుడు జో బిడెన్, అతని భార్య, ప్రథమ మహిళ జిల్ బిడెన్ జూన్ 22 సాయంత్రం ప్రధానమంత్రి గౌరవార్థం విందును ఏర్పాటు చేస్తారు. జూన్ 22న యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధాని ప్రసంగిస్తారు. అమెరికా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించడం ఇది రెండోసారి. అలా చేసిన తొలి భారత ప్రధాని ఆయనే. అంతకుముందు 2016లో అమెరికా పార్లమెంట్‌లో ప్రసంగించారు.

ఎలోన్ మస్క్‌తో సహా ఎందరో ప్రముఖులను కలుసుకునే ఛాన్స్..

ప్రధానమంత్రి జూన్ 23న అనేక ప్రధాన కంపెనీల CEOలతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా టెస్లా, ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్, నోబెల్ బహుమతి గ్రహీత ఆర్థికవేత్త పాల్ రోమర్, కళాకారులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగంలోని నిపుణులను కూడా PM కలవనున్నారు. రచయిత నికోలస్ నాసిమ్ తాలిబ్, పెట్టుబడిదారు రే డాలియోలను ప్రధాని మోదీ కలవవచ్చని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉన్న ఇతర ప్రముఖులలో ఫలూ షా, జెఫ్ స్మిత్, మైఖేల్ ఫ్రోమాన్, డేనియల్ రస్సెల్, ఎల్బ్రిడ్జ్ కోల్బీ, పీటర్ ఆగ్రే, స్టీఫెన్ క్లాస్కో, చంద్రిక టాండన్ ఉన్నారు.

కమలా హారిస్‌తో కలిసి విందు..

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ జూన్ 23న ప్రధాని మోదీకి లంచ్ ఇవ్వనున్నారు. అదే రోజు వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌లో ప్రవాసులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. రెండు దేశాల పర్యటన రెండవ విడతలో భాగంగా ప్రధానమంత్రి జూన్ 24 నుంచి 25 వరకు ఈజిప్టులో పర్యటనలో ఉంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..