Fake Case: చేయని తప్పుకు శిక్ష.. మూడు దశాబ్దాలకు బయటపడిన నిజం.. అధికారులకు కోట్లల్లో ఫైన్

|

May 17, 2021 | 6:03 AM

North Carolina: వారిద్దరూ సోదరులు.. మానసిక వికలాంగులుగా మూడు దశాబ్దాలకు పైగా జైల్లో మగ్గిపోయారు. తీరా కోర్టు వారిద్దరూ నిర్ధోషులని

Fake Case: చేయని తప్పుకు శిక్ష.. మూడు దశాబ్దాలకు బయటపడిన నిజం.. అధికారులకు కోట్లల్లో ఫైన్
Us North Carolina
Follow us on

North Carolina: వారిద్దరూ సోదరులు.. మానసిక వికలాంగులుగా మూడు దశాబ్దాలకు పైగా జైల్లో మగ్గిపోయారు. తీరా కోర్టు వారిద్దరూ నిర్ధోషులని ప్రకటించింది. కట్ చేస్తే.. చేయని తప్పుకు శిక్ష అనుభవించేలా చేసినందుకు ఆ సోదరులకు అధికారులు రూ.550 కోట్ల (75 మిలియన్ల అమెరికా డాలర్లు) పరిహారం చెల్లించాలని అమెరికాలోని ఓ ఫెడరల్‌ కోర్టు తీర్పు చెప్పింది. ఈ పరిహారాన్ని ఆ ఇద్దరే పంచుకోవాలని కోర్టు ఆదేశించింది. 1983లో ఉత్తర కరొలినా రాజధాని రాలీలోని నార్త్‌ రాబ్సన్‌ కౌంటీలో 11 ఏళ్ల బాలిక తన ఇంట్లో అత్యాచారంతోపాటు హత్యకు గురైంది. ఈ కేసులో హెన్రీ మెక్‌కల్లమ్‌, లియోన్‌ బ్రౌన్‌ అనే ఇద్దరు సవతి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకుపంపారు. తప్పుడు సాక్ష్యాధారాలతో వారిపై రాబ్సన్‌ జిల్లా కోర్టులో అభియోగాలు మోపారు. అనంతరం ఆ ఇద్దరికీ మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

అయితే 2014లో ఆ ఇద్దరి డీఎన్‌ఏను పరిశీలించిన తర్వాత బాలికను అత్యాచారం, హత్య చేసింది వారు కాదని, ఇంకో వ్యక్తి అయిన రోస్కో ఆర్టిస్‌ అని తేలింది. దీంతో వారిద్దరిపై కేసులను కోర్టు కొట్టివేసింది. తప్పుడు కేసులు మోపి, తాము శిక్ష అనుభవించడానికి కారుకులైన జేమ్స్‌ లాక్‌లియర్‌, కెన్నెత్‌ సీలి అనే పోలీసు అధికారులపై ఆ ఇద్దరు 2015 నుంచి కోర్టులో పోరాడారు. మెకల్లమ్‌, బ్రౌన్‌కు రూ.550 కోట్ల పరిహారం చెల్లించాలని నార్త్‌ కరోలినా కోర్టు ఆదేశించింది. ఆ అధికారుల తరఫున వాదించిన న్యాయవాదులు రూ.66 కోట్ల పరిహారం చెల్లించేందుకు ఒప్పుకున్నారు. అయితే ఆ ఇద్దరు సోదరులు కూడా మానవహక్కుల ఉల్లంఘన కింద కోర్టులో పోరాడారు.

Also Read:

CID Case: రఘురామకృష్ణంరాజు కాళ్లపై ఉన్న గాయాలకు ‘ఎడిమా’నే కారణం..! రిపోర్టులో..

Viral: బురదలో కూరుకుపోయిన గజరాజును ఎలా రక్షించారంటే ? అటవీ శాఖ ఐడియా అంటే అదేమరి !