No Mask: అమెరికా సంచలన ప్రకటన.. ఇక నుంచి వారికి మాస్క్‌ అవసరం లేదట.. ఎవరినైనా కలువొచ్చు

No Mask: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని నిబంధనలు పెట్టింది. కరోనా నుంచి ..

No Mask: అమెరికా సంచలన ప్రకటన.. ఇక నుంచి వారికి మాస్క్‌ అవసరం లేదట.. ఎవరినైనా కలువొచ్చు

Updated on: Mar 09, 2021 | 10:38 PM

No Mask: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని నిబంధనలు పెట్టింది. కరోనా నుంచి కాపాడుకునేందుకు ఆయుధంగా మాస్క్‌ ధరించడమే. అయితే ఈ క్రమంలో అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఎవరైతే రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారో.. వారు మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) ప్రకటన విడుదల చేసింది. అయితే వారు కలిసే ఎదుటి వ్యక్తులు కూడా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసి ఉండాలని సూచించింది. అప్పుడు మాత్రమే మాస్క్‌ ధరించకుండా వారితో కలుసుకోవచ్చని సూచించింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారికి సంబంధించి సీడీసీ డైరెక్టర్ రోషెల్ వాలెన్స్కీ సోమవారం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేశారు. రెండు మోతాదుల టీకా తీసుకున్న వారు ఇకపై ముఖానికి మాస్క్‌ ధరించకుండా ఇతరులను కలుసుకోవచ్చని తెలిపింది. అయితే భారీ జనసమూహాలకు మాత్రం దూరంగానే ఉండాలని సూచించింది.

కాగా, ప్రస్తుతం అమెరికాలో కేవలం 9.2 శాతం మందికి మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తయిందని, సుమారు 18 శాతం మంది ఒక డోసు టీకా తీసుకున్నారని సీడీసీ తెలిపింది. అందుకే దేశ పౌరులు, నివాసితులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యే వరకు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలిపింది. ఇటీవల దేశంలో కొన్ని రాష్ట్రాలు, నగరాలు, ప్రజారోగ్య నిపుణుల సూచనల మేరకు కోవిడ్‌ ఆంక్షలను ఎత్తివేసినా వైరస్‌ను అరికట్టేందుకు నిబంధనలు పాటిస్తూనే ఉన్నారని సీడీసీ డైరెక్టర్‌ గుర్తు చేశారు.

ఇవి చదవండి :

Covid Vaccine: కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటే రెండు రోజుల విమాన ప్రయాణాలు చేయకూడదు.. సౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు

Helpline Number: భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇక నుంచి అన్ని ఫిర్యాదులు చేయాలంటే 139 నెంబర్‌కే..

Corona Cases Update In India: దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.!