రోడ్లపై కరెన్సీ నోట్ల వర్షం..

రోడ్డు మీద వెళుతున్న వాహనం కరెన్సీ నోట్లను వెదజల్లడంతో దారిన పోయేవారంతా ఆశ్చర్యాయనికి లోనయ్యారు. అమెరికా లోని జార్జియా రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అట్లాంటలో ఓ ఆర్మీ ట్రక్కు కరెన్సీ లోడ్‌తో వెళ్తోంది. అయితే మార్గ మధ్యలో ఆ ట్రక్కు డోర్ అకస్మాత్తుగా తెరుచుకుంది. అదే సమయంలో బలమైన గాలులు వీచాయి. దీంతో ఆ ట్రక్కులో ఉన్న కరెన్సీ నోట్లన్నీ గాల్లోకి ఎగిరాయి. రోడ్ల మీద ఆ నోట్లన్నీ పడటంతో.. దారిన పోయేవారంతా కరెన్సీ నోట్లను […]

రోడ్లపై కరెన్సీ నోట్ల వర్షం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 12, 2019 | 2:19 AM

రోడ్డు మీద వెళుతున్న వాహనం కరెన్సీ నోట్లను వెదజల్లడంతో దారిన పోయేవారంతా ఆశ్చర్యాయనికి లోనయ్యారు. అమెరికా లోని జార్జియా రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అట్లాంటలో ఓ ఆర్మీ ట్రక్కు కరెన్సీ లోడ్‌తో వెళ్తోంది. అయితే మార్గ మధ్యలో ఆ ట్రక్కు డోర్ అకస్మాత్తుగా తెరుచుకుంది. అదే సమయంలో బలమైన గాలులు వీచాయి. దీంతో ఆ ట్రక్కులో ఉన్న కరెన్సీ నోట్లన్నీ గాల్లోకి ఎగిరాయి. రోడ్ల మీద ఆ నోట్లన్నీ పడటంతో.. దారిన పోయేవారంతా కరెన్సీ నోట్లను ఏరుకోడానికి ఎగబడ్డారు. దొరికిన కాడికి అందుకున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అక్షరాల లక్షా 75 వేల డాలర్ల కరెన్సీ నోట్లను దోచేసుకున్నారు.