అమెరికా పడవ ప్రమాదంలో భారతీయ జంట మృతి !

కాలిఫోర్నియాలోని శాంతాక్రజ్ దీవిలో.. జరిగిన పడవ ప్రమాదంలో భారతీయ జంట సంజీరి దేవ్ పూజారి, ఆమె భర్త కౌస్తుభ్ నిర్మల్ కూడా మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఈ నెల 2 న జరిగిన ఈ ప్రమాదంలో ఆ బోటుకు నిప్పు అంటుకుని సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 34 మంది మరణించారు. అమెరికాలో రెండేళ్ల క్రితం సెటిలైన సంజీరి దేవ్ పూజారి, కౌస్తుభ్ నిర్మల్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్టు తెలియడంతో నాగపూర్ లోని వారి కుటుంబం […]

అమెరికా పడవ ప్రమాదంలో భారతీయ జంట మృతి !
Follow us

|

Updated on: Sep 05, 2019 | 1:11 PM

కాలిఫోర్నియాలోని శాంతాక్రజ్ దీవిలో.. జరిగిన పడవ ప్రమాదంలో భారతీయ జంట సంజీరి దేవ్ పూజారి, ఆమె భర్త కౌస్తుభ్ నిర్మల్ కూడా మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఈ నెల 2 న జరిగిన ఈ ప్రమాదంలో ఆ బోటుకు నిప్పు అంటుకుని సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 34 మంది మరణించారు. అమెరికాలో రెండేళ్ల క్రితం సెటిలైన సంజీరి దేవ్ పూజారి, కౌస్తుభ్ నిర్మల్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్టు తెలియడంతో నాగపూర్ లోని వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ నగరంలో ప్రముఖ వైద్యుడు సతీష్ దేవ్ పూజారి కుమార్తె అయిన సంజీరి.. డెంటల్ డాక్టర్ కూడా.. కౌస్తుభ్, సంజీరి ఇద్దరూ ఆరోజున స్కూబా డైవింగ్ కోసం ఈ బోటునెక్కారు. అమెరికాలోనే ఉన్న సతీష్ మరో కూతురు ఈ ప్రమాద ఘటన గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. స్కూబా డైవర్లతో నిండిన ఆ పడవలో 33 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. బోటు డెక్ పై నిద్రిస్తున్న అయిదుగురు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ బోటుకు అసలు నిప్పు ఎలా అంటుకుందో ఇంకా తెలియాల్సి ఉంది. దర్యాప్తు జరుగుతోంది.