America Diwali: వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు జో బైడెన్‌

| Edited By: Shaik Madar Saheb

Nov 05, 2021 | 11:07 AM

America Diwali: దీపావళి సంబరాలు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొంటున్నారు. ఇక తాజాగా వాషింగ్టన్‌ డీసీలో దీపావళి వేడుకలు ఘనంగా..

America Diwali: వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన అధ్యక్షుడు జో బైడెన్‌
Follow us on

America Diwali: దీపావళి సంబరాలు దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొంటున్నారు. ఇక తాజాగా వాషింగ్టన్‌ డీసీలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైట్‌హౌస్‌లో జరిగిన దీపావళి వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పాల్గొన్నారు. చీకటిని తొలగించే సత్యం, జ్ఞానాన్ని దీపావళి మనకు గుర్తు చేస్తుంది అంటూ జో బైడెన్‌ భారతీయులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ బైడెన్‌ ట్వీట్‌ చేశారు. అలాగే నేషనల్‌ డెమొక్రటిక్‌ క్లబ్‌లో ప్రముఖులు దీపావళి సందర్భంగా దీపావు వెలిగించారు. తొలిసారిగా ప్రపంచ వాణిజ్య సంస్థ భవనాలపై దీపావళి థీమ్‌ను ప్రదర్శించారు. న్యూయార్క్‌లోని హడ్సన్‌ నదీతీరంలో ఎన్‌ఆర్‌ఐలు నదీతీరంలో బాణసంచాలు కాల్చారు.

కమలా హారిస్ శుభాకాంక్షలు..

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. యునైటెడ్ స్టేట్స్, ప్రపంచవ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అంటూ ఆమె ఓ వీడియోను ట్విట్ చేశారు.

జపాన్‌లో..
జపాన్‌లోని ప్రవాస భారతీయులు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. టోక్యోలో బాణసంచాలు కాల్చి కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకొన్నారు. అంతేకాకుండా హాంకాంగ్‌, ఇండోనేషియా, శ్రీలంక, మలేషియా తదితర దేశాల్లో పండగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు.

 

ఇవి కూడా చదవండి:

America Poison Frog: డ్రాగన్ కంట్రీ నుంచి తైవాన్‌ను కాపాడేందుకు అదిరిపోయే ప్లాన్ వేసిన అమెరికా.. అదేంటంటే..

WHO: కరోనా ముప్పు ఇంకా పొంచివుంది.. ఫిబ్రవరి నాటికి యూరప్‌లో 5 లక్షల మరణాలు: డబ్ల్యూహెచ్ఓ