గాల్లో చక్కర్లు కొడుతూ.. హడ్సన్ నదిలో పడ్డ హెలికాప్టర్
న్యూయార్క్‌లో హెలిక్యాప్టర్ కుప్ప కూలింది. ఆకాశంలో చక్కర్లు కొట్టి నదిలో పడిపోయింది. చాపర్‌లోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటాన్ పట్టణం సమీపంలోని హడ్సన్ నదిలో కూలిపోయింది. సమీపంలోని ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూయల్ నింపుకున్న కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ముందుకు వెళ్లలేక, పైకి వెళ్లలేక కంట్రోల్ తప్పి నదిలోనే పడిపోయింది. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, వాటర్ సేఫ్టీ అధికారులు క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకున్నారు. చాపర్‌లో ఉన్న ఇద్దరిని కాపాడారు. అధికారులు అత్యవసరంగా స్పందించడం వల్లనే […]
న్యూయార్క్‌లో హెలిక్యాప్టర్ కుప్ప కూలింది. ఆకాశంలో చక్కర్లు కొట్టి నదిలో పడిపోయింది. చాపర్‌లోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటాన్ పట్టణం సమీపంలోని హడ్సన్ నదిలో కూలిపోయింది. సమీపంలోని ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూయల్ నింపుకున్న కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ముందుకు వెళ్లలేక, పైకి వెళ్లలేక కంట్రోల్ తప్పి నదిలోనే పడిపోయింది.
సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది, వాటర్ సేఫ్టీ అధికారులు క్షణాల్లో ఘటనాస్థలికి చేరుకున్నారు. చాపర్‌లో ఉన్న ఇద్దరిని కాపాడారు. అధికారులు అత్యవసరంగా స్పందించడం వల్లనే చాపర్‌లో ఉన్న సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు.