అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ విధించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. ఇతర దేశాల నుంచి అమెరికా కంప్యూటర్ నెట్‌వర్క్‌కు ప్రమాదం పొంచి ఉందని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లొచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వివరించారు. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. చైనాకు చెందిన అతిపెద్ద టెలికాం కమ్యూనికేషన్స్ ఎక్విప్‌మెంట్ కంపెనీ హువావే లక్ష్యంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా హువావే కంపెనీకి అమెరికా ప్రభుత్వానికి […]

అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ విధించిన ట్రంప్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 16, 2019 | 4:57 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ విధించారు. ఇతర దేశాల నుంచి అమెరికా కంప్యూటర్ నెట్‌వర్క్‌కు ప్రమాదం పొంచి ఉందని, దేశ భద్రతకు ముప్పు వాటిల్లొచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ వివరించారు. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. చైనాకు చెందిన అతిపెద్ద టెలికాం కమ్యూనికేషన్స్ ఎక్విప్‌మెంట్ కంపెనీ హువావే లక్ష్యంగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా హువావే కంపెనీకి అమెరికా ప్రభుత్వానికి మధ్య పలు వివాదాలు చెలరేగాయి.  ఈ క్రమంలో అమెరికాకు చెందిన నెట్‌వర్క్ కంపెనీలు ఇతర దేశాల నుంచి టెలికాం, కమ్యూనికేషన్స్ పరికరాల కొనుగోలుకు అడ్డుకట్ట పడింది. అలాగే విదేశీ కంపెనీలు కూడా అమెరికా కంపెనీల నుంచి నెట్‌వర్క్ పరికరాలను కొనాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి.

ట్రంప్ ఆర్డర్లు వెలువడిన కొద్దిసేపటికి అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖ తాము ఏ కంపెనీలపై అనాసక్తిగా ఉన్నమో తెలియజేస్తూ ఒక జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇప్పటిదాకా హువావే పేరు మాత్రమే ఉంది. దీంతో హువావే, దాని అనుబంధ కంపెనీలు అమెరికా సాంకేతికను కొనుగోలు చేయాలంటే కచ్చితంగా అమెరికా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి.

చైనా సప్లయర్ల వద్ద నుంచి కొనుగోలు చేసే ఉపకరణాల వల్ల అమెరికా ఇంటర్నెట్ అండ్ టెలీకమ్యూనికేషనన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ముప్పు పొంచి ఉందని అమెరికా భావిస్తోంది. హువావే చైనాకు గూఢచర్యం చేస్తోందని అమెరికా విశ్వసిస్తోంది.

అమెరికా నెట్‌వర్క్స్‌ను కాపాడుకునేందుకు ఇది సరైన చర్య అని ఫెడరల్ కమ్యూనికేషన్స్ చైర్మన్ అజిత్ పాయ్ తెలిపారు. అమెరికా ఇతర మిత్రదేశాలపై కూడా హువావేకు సంబంధించి ఒత్తిడి తీసుకువస్తోంది. అయితే యూరప్ దేశాలు మాత్రం అమెరికా విధానాలను తప్పుబడుతున్నాయి. ప్రస్తుతం చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో ట్రంప్ తాజా చర్య వీటిని మరింత పెంచేలా ఉంది.