H-1B Vias: గుడ్‌న్యూస్‌.. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది..?

|

Mar 10, 2021 | 7:05 PM

H-1B Vias: 2021 అక్టోబర్‌1 నుంచి 2022 సెప్టెంబర్‌ 30 వరకు హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియనే మార్చి 10 నుంచి ప్రారంభమైంది. 2021-22..

H-1B Vias: గుడ్‌న్యూస్‌.. హెచ్‌-1బీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ ఎలా ఉంటుంది..?
Follow us on

H-1B Vias: 2021 అక్టోబర్‌1 నుంచి 2022 సెప్టెంబర్‌ 30 వరకు హెచ్‌-1బీ వీసా దరఖాస్తు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియనే మార్చి 10 నుంచి ప్రారంభమైంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ హెచ్‌-1బీ వీసాల నమోదు ప్రక్రియ ఈనెల 25 వరకు కొనసాగుతుంని యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌ ప్రకటించింది. లాటరీ ద్వారానే హెచ్‌-1బీ వీసాల అందజేస్తామని, కంప్యూటర్‌ ఆధారిత లాటరీ ఫలితాలను మార్చి 31న వెల్లడిస్తామని తెలిపింది. ఏప్రిల్‌ 1న నుంచి దరఖాస్తులను దాఖలు చేయడం ప్రారంభించవచ్చు.

అయితే దరఖాస్తుదారుడు యూఎస్‌సీఐఎస్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మాత్రమే హెచ్‌-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌కు వర్కర్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం అందిచాలి. ఎంపికైన దరఖాస్తుదారులు మాత్రమే హెచ్‌-1బీ కయాప్‌ సబ్జెక్ట్‌ పిటిషన్లకు దాఖలు చేయడానికి అర్హులు. హెచ్‌-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్‌ ఉన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది 85,000 కొత్త హెచ్‌-1బీ వీసాలను జారీ చేస్తుంది. దీంతో భారతీయులకు, ఐటీ సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం ఉన్న సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే హెచ్‌-1బీ వీసాలు పొందిన వారు అక్టోబర్‌ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరవచ్చు. ప్రతి సంవత్సరం విదేశీయులకు 65 వేల హెచ్‌-1బీ వీసాలు జారీ చేస్తోంది. అలాగే మరో 20 వేల హెచ్‌-బీ వీసాలు మాస్టర్‌ క్యాప్‌ కిందకు వస్తోంది. ఈ సంవత్సరం యూఎస్‌సీఐఎస్‌కు సుమారు 2.67 లక్షల రిజిస్ట్రేషన్‌లు అందాయి. ఇందులో 60 శాతానికి పైగా భారత్‌కు చెందిన వారే. ఈ ఏడాది కూడా దాదాపు 60 వేల వీసాలు భారతీయులకు తక్కే అవకాశం ఉందని అంచనా.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇలా..

1. ముందుగా ప్రతి దరఖాస్తుదారుడు యూఎస్‌సీఐఎస్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. దీని ద్వారా మాత్రమే హెచ్‌-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.
2. ప్రతి దరఖాస్తుదారుడు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద 10 డాలర్లు (రూ.72) చెల్లించాలి.
3. ఈ రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌కు వర్కర్‌కు సంబంధించిన ప్రాథమిక సమాచారం అవసరం ఉంటుంది..
4. ఎంపికైన దరఖాస్తుదారుడు మాత్రమే హెచ్‌-1బీ క్యాప్‌-సబ్జెక్ట్‌పిటిషన్లను దాఖలు చేసుకోవడానికి అర్హులు.

ఇవి చదవండి :

Prime Minister of Pakistan: సోషల్ మీడియాలో వీడియో.. మరింత దిగజారుతున్న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిష్ఠ..

Onions Buffer Stock: సామాన్యులకు గుడ్‌న్యూస్‌: ఇక ఉల్లి ధర పెరగదు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!