‘ నన్నే అభిశంసిస్తారా ? ఇది మూకలు జరిపే హత్యే ‘ ! ట్రంప్ అసహనం

తనను అభిశంసించడానికి డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘ మూకలు జరిపే హత్య ‘(లించింగ్) గా అభివర్ణించారు. ‘ మీరంతా నన్ను అభిశంసించడానికి అవసరమైన విచారణ (ఎంక్వయిరీ) కోసం కిందా, మీదా పడుతున్నారు. కానీ.. ఇది ఓ అధ్యక్షుడిపై సామూహికంగా జరిపే దాడే ‘ అని ఆయన ట్వీట్ చేశారు. ఏదో ఒకరోజు ఒక డెమొక్రాట్ సభ్యుడు అధ్యక్షుడై, మా పార్టీకి చెందిన రిపబ్లికన్లు సాధారణ మెజారిటీతో గెలిచినప్పటికీ.. వాళ్ళు ఎలాంటి ప్రాసెస్ […]

' నన్నే అభిశంసిస్తారా ? ఇది మూకలు జరిపే హత్యే ' ! ట్రంప్ అసహనం
Follow us

|

Updated on: Oct 23, 2019 | 12:58 PM

తనను అభిశంసించడానికి డెమొక్రాట్లు చేస్తున్న ప్రయత్నాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘ మూకలు జరిపే హత్య ‘(లించింగ్) గా అభివర్ణించారు. ‘ మీరంతా నన్ను అభిశంసించడానికి అవసరమైన విచారణ (ఎంక్వయిరీ) కోసం కిందా, మీదా పడుతున్నారు. కానీ.. ఇది ఓ అధ్యక్షుడిపై సామూహికంగా జరిపే దాడే ‘ అని ఆయన ట్వీట్ చేశారు. ఏదో ఒకరోజు ఒక డెమొక్రాట్ సభ్యుడు అధ్యక్షుడై, మా పార్టీకి చెందిన రిపబ్లికన్లు సాధారణ మెజారిటీతో గెలిచినప్పటికీ.. వాళ్ళు ఎలాంటి ప్రాసెస్ గానీ, న్యాయబధ్ధమైన హక్కులు గానీ లేకుండానే ఆ అధ్యక్షుడిని అభిశంసించే సమయం వస్తుంది ‘ అని ఆయన ‘ శాపనార్థాలు ‘ పెట్టారు. రిపబ్లికన్లంతా ఈ రోజు ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని గమనించండి.. గుర్తు చేసుకోండి.. ఇది సామూహిక దాడి..లేదా హత్యే.. కానీ.. విజయం మాత్రం మనదే ‘ అని ట్రంప్ ట్వీటించారు. 1882.. 1968 మధ్య కాలంలో అమెరికాలో 4,700 సామూహిక హత్యా ఘటనలు జరిగాయి. బాధితులు, లేదా మృతుల్లో చాలామంది (3,400 మంది) నల్ల జాతీయులు.. వీరిలో యువతులు, యువకులు కూడా ఉన్నారు. బానిసలుగా పట్టుబడినవారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చేవారు. అటు-ట్రంప్ చేసిన ట్వీట్లను సమర్థించడానికి వైట్ హౌస్ యత్నించింది. అమెరికా చరిత్రలో జరిగిన చీకటి అధ్యాయాలతో అధ్యక్షుడు తనను పోల్చుకోవడానికి ప్రయత్నించడం లేదని వైట్ హౌస్ ప్రతినిధి హొగన్ గిడ్లే అన్నారు. తాను అధ్యక్షుడైనప్పటినుంచి మీడియా తనను ఎలా ట్రీట్ చేస్తోందో మాత్రమే ఆయన చెబుతున్నారని హొగన్ పేర్కొన్నారు. మరోవైపు-రిపబ్లికన్లు సమైక్యంగా ఉండి .. అభిశంసన నుంచి తననురక్షించేందుకు ఏవిధమైన కృషీ చేయడంలేదని ట్రంప్ తన పార్టీ సభ్యులపైనే విసుక్కున్నారు. కాగా-ఇంపీచ్ మెంట్ ఎంక్వయిరీని ట్రంప్ లించింగ్ తో పోల్చడంపట్ల అనేకమంది ఎంపీలు ఆయనను దుయ్యబట్టారు. ‘ ఈ ప్రయత్నం మూకలు జరిపే దాడి వంటిదా ? అసలు మీకేమయింది ? నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇలాంటి దాడులకు గురయ్యారో మీకు తెలుసా ? మీరు చేసిన ట్వీట్ ని డిలీట్ చేయండి ‘ అని బాబీ రష్ అనే రిపబ్లికన్ కోరారు. ఇలాంటి పదాలను వాడరాదని, వెంటనే ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని మరో రిపబ్లికన్ డిమాండ్ చేశారు.