Coronavirus: వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. 99 శాతం కోవిడ్‌ మరణాలు.. అసలు కారణం అదే..!

|

Jul 05, 2021 | 6:26 AM

Coronavirus: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విబృంభిస్తూ కోట్లాది మందిని బలి తీసుకుంది. ఫస్ట్‌వేవ్‌లో కంటే సెకండ్‌వేవ్‌లో తీవ్ర స్థాయిలో విజృంభించింది..

Coronavirus: వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. 99 శాతం కోవిడ్‌ మరణాలు.. అసలు కారణం అదే..!
Follow us on

Coronavirus: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విబృంభిస్తూ కోట్లాది మందిని బలి తీసుకుంది. ఫస్ట్‌వేవ్‌లో కంటే సెకండ్‌వేవ్‌లో తీవ్ర స్థాయిలో విజృంభించింది. ఒక వైపు వ్యాక్సినేషన్‌, మరో వైపు లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గిపోయింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ. మరణాలు మాత్రం సంభవిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో భారీ ఎత్తున వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతోంది. అయినప్పటికీ కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా అమెరికాలో కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోతున్న బాధితుల్లో 99 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకోని వారే ఉన్నారని అమెరికాలో ప్రముఖ అంటు వ్యాధుల నిపుణులు ఆంటోని ఫౌచీ చెబుతున్నారు. వ్యాక్సిన్‌ అనేది కోవిడ్‌ మరణాలను నివారించగలిగేదేనని స్పష్టం చేస్తున్నారు. అయితే కరోనా మహమ్మారిని ఎదుర్కొనే అత్యంత సమర్థమైన సాధనం మన చేతుల్లో ఉన్నప్పటికీ.. దానిని అందరూ పాటించకపోవడం విచారకరమని ఆయన ఆేవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల కోసం ఏదైనా చేసేందుకు పలు దేశాలు సిద్ధంగా ఉన్నాయని, ఇలాంటి సమయంలో అమెరికా ప్రజలకు సరిపోయేంత వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. అయినప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకునేందుకు చాలా మంది ముందుకు రావడం లేదన్నారు. ప్రస్తుతం మనందరి శత్రువు కరోనా వైరస్‌ అని.. అందుకే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ తప్పనిసరి తీసుకోవాలని అమెరికా ప్రజలకు ఆయన సూచించారు. అయితే వ్యాక్సిన్‌ల పట్ల కొందరిలో వ్యతిరేక భావన ఉందని, దానిని పక్కనబెట్టాలని ఆంటోని ఫౌచీ సూచిస్తున్నారు. ప్రపంచంలో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఒక్క అమెరికాలోనే ఇప్పటి వరకు 6 లక్షల మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. థర్డ్‌వేవ్‌ ముప్పు మరింత ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్న నేపథ్యంలో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. కరోనా కట్టడికి ఇంకొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగవంతం చేశాయి.

ఇవీ కూడా చదవండి:

COVID-19: చైనా దగ్గర అన్ని వ్యాక్సీన్లు ఉన్నాయా?.. సంచలన విషయాలు వెల్లడించిన ఆ దేశ టాప్ ఎపిడెమియాలజిస్ట్..

Covid-19 Vaccine: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో ఘనత.. దేశంలో 35 కోట్లు దాటిన టీకాల పంపిణీ