Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

టీడీపీకి ‘టాటా’ చెప్పనున్న ఆ ముగ్గురు..? బాబుకు పెద్ద షాక్ తప్పదా..!

Big Shock to Chandrababu Naidu soon, టీడీపీకి ‘టాటా’ చెప్పనున్న ఆ ముగ్గురు..? బాబుకు పెద్ద షాక్ తప్పదా..!

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 23 సీట్లు సాధించి ఘోర పరాజయం పాలైన టీడీపీకి బ్యాడ్ టైమ్ కొనసాగుతూనే ఉంది. అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్‌గానే ఉన్నప్పటికీ.. టీడీపీలో ఇన్ని రోజులు కీలకంగా ఉన్న పలువురు పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. వారిలో కొంతమంది వేరే పార్టీ కండువాలను కూడా కప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న మరికొన్ని పెద్ద తలకాయలు కూడా త్వరలోనే టీడీపీకి గుడ్‌బై చెప్పబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారిలో ప్రముఖంగా గంటా శ్రీనివాసరావు, నారాయణ, బోండా ఉమ పేర్లు వినిపిస్తున్నాయి.

కాపు సామాజిక వర్గానికి చెందిన బోండా ఉమ 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత తక్కువ సమయంలోనే అధినేత చంద్రబాబుకు దగ్గరయ్యారు. అంతేకాదు అప్పటి ప్రతిపక్షం వైసీపీపై అవకాశం వచ్చినప్పుడల్లా స్వరాన్ని పెంచి మరీ ఘాటుగా విమర్శించేవారు. కానీ 2019 ఎన్నికలకు ముందు నుంచి పరిస్థితులు మారిపోయాయి. పార్టీలోని కొందరు నేతల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తోన్న ఆయన.. ఎన్నికల తరువాత పార్టీ ఓటమితో ఆయన తీరు మారిపోయింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీలో చేరేందుకు బోండా ఉమ ఆలోచిస్తున్నారని సమాచారం. దీనికి సంబంధించి వైసీపీ నేత ఆమంచితో ఆయన సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.

ఇక బోండా ఉమ దారిలోనే చంద్రబాబు మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన గంటా శ్రీనివాసరావు కూడా ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైసీపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. తన రాజకీయ జీవితాన్ని టీడీపీతోనే ప్రారంభించిన గంటా.. ఆ తరువాత మధ్యలో పార్టీని వీడినప్పటికీ.. 2014లో మళ్లీ సొంతగూటికే వెళ్లారు. ఇక 2014-19 వరకు చంద్రబాబు కేబినెట్‌లోనూ పని చేశారు. ఇక ఈ ఎన్నికల తరువాత ఈయన కూడా పార్టీని వీడబోతున్నారని వార్తలు వచ్చాయి. దానికి తోడు వైసీపీలోకి తాను వెళ్లాలనుకుంటే ఎవ్వరూ ఆపలేరని ఆ మధ్యన గంటా కామెంట్లు కూడా చేశారు. అయితే వైసీపీలోకి ఈయన రాకను కొంతమంది వ్యతిరేకిస్తున్నారని గాసిప్‌లు వినిపించినా.. ఇప్పుడు గంటా చేరికకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. దీంతో త్వరలోనే గంటా కూడా వైసీపీ కండువాను కప్పుకోనున్నారని సమాచారం.

అయితే బోండా, గంటా చూపు వైసీపీ వైపు ఉంటే.. మాజీ మంత్రి నారాయణ చూపు మాత్రం బీజేపీ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీకి ఆర్థిక స్తంభంగా నిలిచిన నారాయణ.. పరిస్థితి ఈ ఎన్నికల తరువాత బాగా మారిపోయింది. ఎన్నికలకు ముందే ఆయనకు సంబంధించి విద్యా సంస్థలపై ఐటీ, సీబీఐ దాడులు జరిగాయి. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐను రాష్ట్రంలోకి అనుమతినిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో మళ్లీ ఎప్పుడైనా దాడులు జరిగితే.. ఆయన విద్యా సంస్థలకు ముప్పు వాటిల్లే  పరిస్థితి తప్పకపోవచ్చు. ఇక రాజకీయాల కంటే తమ వ్యాపారాలే కీలకమని భావించిన కొంతమంది టీడీపీ ఎంపీలు ఆ మధ్యన మూకుమ్మడిగా బీజేపీలో చేరారు. ఇప్పుడు వారి బాటలోనే నారాయణ కూడా వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తనను బీజేపీలోకి చేర్చుకునేలా బీజేపీ అధిష్టానంతో మాట్లాడాలని తన జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేతను కోరారట. దీనికి ఆ నేత నుంచి సానుకూల స్పందన కూడా వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చాలా త్వరలోనే నారాయణ.. టీడీపీకి గుడ్‌బై చెప్పనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.

వీటిలో నిజమెంతుందో తెలీదు గానీ.. టీడీపీలో ఇన్ని రోజులు కీలకంగా వ్యవహరించిన ఈ ముగ్గురు ఘనాపాటీలు ఆ పార్టీని వీడితే.. చంద్రబాబుకు పెద్ద షాక్ తప్పదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీకి చెందిన సీనియర్ నేతల వరుస హఠాన్మరణాలతో బాధపడుతోన్న ఆయనపై ఈ రాజకీయ వలసల టెన్షన్ పడే సమయం దగ్గర్లోనే ఉందన్నవార్తలువినిపిస్తున్నాయి.Big Shock to Chandrababu Naidu soon, టీడీపీకి ‘టాటా’ చెప్పనున్న ఆ ముగ్గురు..? బాబుకు పెద్ద షాక్ తప్పదా..!

Related Tags