Russia Ukraine War: రష్యా చర్యల వల్ల తమ దేశంలో ఎంతగా ధ్వంసమైందో(Russia Destruction) తెలియజేస్తూ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) ఒక వీడియోను విడుదల చేశారు. దాడులకు ముందు ఉక్రెయిన్ ఎలా ఉందో తెలుపుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. యుద్ధంతో మసకబారిక తనదేశ పరిస్థితులపై చేసిన వీడియోను ఆయన సామాజిక మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అక్కడి ప్రస్తుత భయానక పరిస్థితులను ప్రపంచానికి తెలిపేందుకు ఆయన ఈ ప్రయత్నం చేశారు. రష్యా బాంబు దాడుల వల్ల కాలిబూడిదైన భవనాలు, మరియుపోల్ ప్రసూతి ఆసుపత్రి వద్ద రోగుల ఆర్తనాదాలు, తల్లిదండ్రులను విడిచి పక్క దేశాలకు వలస వెళుతున్న చిన్నారుల పరిస్థితి, దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వందల మంది పౌరుల సామూహిక ఖననాల వంటి హృదయ విదారక దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. రష్యా తమ దేశంలో చేస్తున్నది మారణహోమమే అనే విధంగా ఈ వీడియోలో ఉంది.
బుధవారం అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించిన జెలెన్‌స్కీ.. ఈ వీడియోను అక్కడి ప్రతినిధుల ముందు ప్రదర్శించారు. “ఒక్కసారి ఈ వీడియో చూడండి.. రష్యా సేనలు మా దేశంలో ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నాయో అర్థమవుతుంది” అంటూ ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. వీడియోను చూసిన అమెరికా చట్టసభ ప్రతినిధులు కొందరు కన్నీటి పర్యంతమయ్యారు. జెలెన్‌స్కీ పోస్ట్ చేసిన వీడియో..
ఇవీ చదవండి..
Kim Jong Un: మూడో క్షిపణి ప్రయోగించిన కిమ్ మామ.. మిసైల్ ఏమైందంటే..
Jio Prepaid Plans: రిలయన్స్ జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. అదిరిపోయే ప్లాన్స్