Worlds Third Largest Diamond: ప్రపంచంలో అతి పెద్ద మూడో వజ్రం ఆఫ్రికా దేశాల్లో లభ్యం.. ఇది ఎన్ని క్యారెట్లుందో తెలుసా?

|

Jun 17, 2021 | 7:15 PM

Worlds Third Largest Diamond: ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం ఆఫ్రికా దేశం బోట్స్వానాలో కనుగొన్నారు. ఇది 1,098 క్యారెట్ల వజ్రం.

Worlds Third Largest Diamond: ప్రపంచంలో అతి పెద్ద మూడో వజ్రం ఆఫ్రికా దేశాల్లో లభ్యం.. ఇది ఎన్ని క్యారెట్లుందో తెలుసా?
Worlds Third Largest Diamond
Follow us on

Worlds Third Largest Diamond: ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం ఆఫ్రికా దేశం బోట్స్వానాలో కనుగొన్నారు. ఇది 1,098 క్యారెట్ల వజ్రం. దేబ్స్వానా డైమండ్ కంపెనీ ఈ వజ్రాన్ని అధ్యక్షుడు మొగ్వేట్సీ మెస్సీకి బహుమతిగా ఇచ్చింది. గత 50 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి ఈ డైమండ్ కంపెనీకి ఇంత పెద్ద వజ్రం లభించింది. ఈ వజ్రం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తోంది. ప్రత్యేక విషయం ఏమిటంటే, దీనికి ముందు, ప్రపంచంలోనే అత్యంత పెద్ద వజ్రాలు రెండూ ఆఫ్రికాలో లభించాయి.

ప్రపంచంలోని అతిపెద్ద వజ్రం 3,106 క్యారెట్లు 1905 లో ఆఫ్రికాలో కనుగొన్నారు. దీనికి కులియన్ స్టోన్ అని పేరు పెట్టారు. అదే విధంగా, 1109 క్యారెట్ల రెండవ అతిపెద్ద వజ్రం 2015 లో బోట్స్వానాలో కనుగొనబడింది, దీనికి లెసిడి-లా-రోనా అనే పేరు పెట్టారు. ఇప్పుడు మూడో అతి పెద్ద వజ్రం కూడా బోట్స్వానా లోనే లభించడం విశేషం. బాకీ డెబ్స్వానా డైమండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ లినెట్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాట్లాడుతూ ప్రాథమిక పరిశోధనలలో ఇది ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం అని తేలిందని చెప్పారు. అక్కడి గనుల మంత్రి లెఫోకో మోగి మాట్లాడుతూ, ఈ వజ్రానికి ఇప్పటి వరకు పేరు పెట్టబడలేదన్నారు. దీనికి త్వరలో పేరు పెడతామని వెల్లడించారు.

లెఫోకో చెబుతున్న దాని ప్రకారం, వజ్రం 72 మిమీ పొడవు, 52 మిమీ వెడల్పుతో ఉంటుంది. ఇది 27 మిమీ మందంగా ఉంది. కరోనా కాలంలో, 2020 నుండి ఇప్పటి వరకు, వజ్రాల వ్యాపారం చాలా చెడు పరిస్తితుల్లో ఉంది . అటువంటి పరిస్థితిలో, ఈ వజ్రం పొందడం మంచి సమయం వస్తుందనడానికి సంకేతంగా అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. వజ్రాల ఆదాయంలో 80 శాతం దేబ్స్వానా డైమండ్ కంపెనీ ప్రభుత్వానికి చెల్లించాలి. 2020 లో కంపెనీ ఉత్పత్తి 29 శాతం తగ్గింది. అదే సమయంలో అమ్మకాలలో 30 శాతం క్షీణత ఉంది.

Also Read: Naftali Bennett: రాజకీయ గురువునే కుర్చీ నుంచి దింపి ఇజ్రాయిల్ లో సంకీర్ణ ప్రభుత్వ సారథిగా నాఫ్తాలి బెన్నెట్

Helping others: ఇతరులకు సహాయం చేసే ప్రజల్లో పేద దేశాలే టాప్.. భారత్ ర్యాంక్ 14.. ధనిక దేశాలు కింది వరుసలో!