International Covid Update: శాస్త్రజ్ఞులకే సవాల్ విసురుతున్న కరోనా.. ప్రపంచంలో భారీ సంఖ్యలో కేసులు నమోదు
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గత ఏడాది నుంచి భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. గత 24గంటల్లో 4,17,554 పాజిటివ్ కేసులు..
International Covid Update: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. గత ఏడాది నుంచి భారీ సంఖ్యలో కేసులు నమోదవుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. గత 24గంటల్లో 4,17,554 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు 10,63,47,986 దాటాయి. గడచిన 24గంటల్లోనే 10,920 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాలు 23,20,576 దాటాయి. రికవరీ కేసులు 7.81 కోట్లుగా ఉండగా… యాక్టివ్ కేసులు 2.58 కోట్లకు పైగా ఉన్నాయి. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు చనిపోతున్నారని తెలుస్తోంది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల్లో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇండియా , బ్రెజిల్, రష్యా, యుకె లు తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. మొత్తం మరణాల్లో కూడా అమెరికాదే అగ్రస్థానం. తర్వాత స్థానాల్లో బ్రెజిల్, మెక్సికో, ఇండియా, బ్రిటన్ లు కొనసాగుతున్నాయి.
Also Read: