
ది వరల్డ్ క్రైసిస్-1915.. నూటా పదేళ్ల కిందట ఫస్ట్‌వాల్డ్ వార్ వచ్చినప్పుడు, ప్రపంచం ఎంత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టబడిందో చెబుతూ విన్‌స్టన్ చర్చిల్ రాసిన పుస్తకం. కోటిన్నర మందికిపైగా చనిపోయి, రెండున్నర కోట్ల మందికి కాళ్లూచేతులు విరిగిన డెడ్లీయస్ట్ సిట్యువేషన్‌కి అక్షరరూపం అది. తర్వాత… రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆయనే యూకేకి ప్రైమ్‌మినిస్టర్‌గా చేశారు. అంతకంటే పెద్ద విపత్తుకు సాక్షిగా నిలబడ్డారు. అదంతా గతం. తర్వాత, అదిగదిగో మూడో ప్రపంచ యుద్ధం అంటూనే ఆరేడు దశాబ్దాలు గడిచిపోయాయి. థర్డ్ వరల్డ్ వార్ ఐతే రాలేదుగానీ, థర్డ్ వరల్డ్‌వార్‌ని మించి మూల్యం చెల్లించుకునే రోజులు మాత్రం వచ్చేశాయా? పెద్దన్నగా పిలిపించుకునే ఒక పిచ్చిమారాజు సమక్షంలో యావత్ ప్రపంచం మరోసారి తీవ్ర సంక్షోభంలోకి జారిపోతోందా? ఎస్.. ది వరల్డ్ క్రైసిస్-2026.. ఆన్‌ది వే. నిన్నటిదాకా కోరలు చాచిన ఎల్‌నినో.. కరవురక్కసి కరాళ నాట్యానికి రిహార్సల్స్ చేస్తోంది. తీవ్ర వర్షాభావంతో మన దేశంలోనే 12 రాష్ట్రాల్లో దాదాపు 315 జిల్లాలు భారీ మూల్యం చెల్లించుకోడానికి రెడీగా ఉన్నాయి. జంట భూకంపాలతో వణికిన వెనెజువెలా ఇప్పటికీ శిథిలాల కిందే చిక్కుకుంది. మహానగరాలే నేలమట్టమై, ప్రాణనష్టం 50 వేలు దాటొచ్చన్న అంచనాలతో, 63 వేల కోట్ల నష్టంతో పీకల్లోతు కష్టాల్లో మునిగింది వెనెజువెలా. 2022...