World Oceans Day: ప్రపంచ జీవకోటికి సముద్రమే ఆధారం.. నేడు ప్రపంచ సముద్ర దినోత్సవం..

|

Jun 08, 2021 | 7:08 AM

మన నివసించే ఈ భూ గ్రహంపై భూమి కేవలం 29 శాతం మాత్రమే ఉండగా.. మిగిలినదంతా సముద్ర నీరే. ఈ గ్రహంలోని జీవులన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా

World Oceans Day: ప్రపంచ జీవకోటికి సముద్రమే ఆధారం.. నేడు ప్రపంచ సముద్ర దినోత్సవం..
World Oceans Day
Follow us on

మన నివసించే ఈ భూ గ్రహంపై భూమి కేవలం 29 శాతం మాత్రమే ఉండగా.. మిగిలినదంతా సముద్ర నీరే. ఈ గ్రహంలోని జీవులన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా సముద్రాలపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. కానీ అటువంటి సముద్రాలన్నీ చెత్తాచెదారంతో నిండిపోతున్నాయి. విచ్చలవిడిగా వ్యర్థాలను తీసుకొచ్చి కడలి నీటిలో పడేస్తున్నారు మనుషులు. దీంతో కాలుష్య కోరల్లో చిక్కుకొని సముద్రజీవులు కూడా అంతరించిపోతున్నాయి. సాగరం బాగుంటేనే సకల జీవరాశులు బాగుంటాయనే విషయాన్ని విస్మరిస్తున్నారు చాలా వరకు. సముద్రాలను కలుషితం చేస్తూ సర్వనాశనం చేస్తున్నారు. సముద్రాలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించే ప్రతి సంవత్సరం జూన్ 8న ప్రపంచ సముద్ర దినోత్సవం నిర్వహిస్తున్నారు.

సముద్రాన్ని చెత్తమయం చేస్తున్నారు. చాలా దేశాలు వ్యర్థాలను నౌకల్లో తరలించి… సముద్రాల్లో పడేస్తున్నాయి. ఇలా రోజూ వేల టన్నుల చెత్త సముద్రాల్లో కలుస్తోంది. అందులో ఎక్కువ భాగం ప్లాస్టికే ఉంటుంది. భూమిలో కరగని ఈ కాలుష్య కారకం సముద్రాల్లోని చేపలు ఇతర జీవుల్ని చంపేస్తోంది. ఆ కాలుష్యపు నీటిలో అరుదైన జీవజాతులు కూడా అంతరించిపోతున్నాయి. సముద్ర మొక్కలు నశించిపోతున్నాయి. ప్రతి ఏటా జూన్ 8న ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం జరుపుకోవడం తప్ప…దాన్ని కాపాడుకునేందుకు తీసుకునే చర్యలు మాత్రం శూన్యంగా ఉంటున్నాయి.

సముద్రాల ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతున్నారు మానవులు. కడలిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. ప్రపంచ సముద్రాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి జూన్‌ 8న కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. బ్రెజిల్‌లోని రియో డిజనీరో నగరంలో 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచాలని నిర్ణయించారు. చివరకు ఐక్యరాజ్యసమితి 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది. సముద్రాలు బాగుండాలి… జీవులూ బాగుండాలి అనేది ఈ ఏడాది అంతర్జాతీయ సముద్ర దినోత్సం థీమ్‌గా ఎంపిక చేశారు.

Also Read: Jagananna Thodu Pathakam: చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం.. రెండో విడత జగనన్న తోడు పథకం కింద సీఎం జగన్ నగదు జమ

Old Currency Notes: పాత 500 రూపాయల నోట్‌తో రూ. 10 వేలు సంపాదించొచ్చు.. అదెలాగంటే..