AIR Pollution: మనిషి బతకాలంటే అన్నింటికంటే ముఖ్యమైంది గాలి. ఇది ఎవరూ కాదనలేని నిజం. తిండి, నీరు ఇలా ఏది లేకపోయినా కొద్ది సమయమైనా జీవించగలరు కానీ.. గాలి అందకపోతే క్షణాల్లో చనిపోవాల్సిందే. అయితే అదే గాలి ఇప్పుడు మనషి ప్రాణాన్ని తీసేస్తోంది. పారిశ్రామికరణ, టెక్నాలజీ వినియోగం, పెరుగుతోన్న ఇంధన వినియోగం ఇవన్నీ వాయు కాలుష్యాన్ని పెంచేస్తున్నాయి. ఈ గాలి కాలుష్యం కారణంగా ఏటా ఏకంగా 70 లక్షల మంది అకాల మరణం పొందుతున్నారంటా. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. మానవాళి ఎదుర్కొంటున్న సమస్యల్లో గాలి కాలుష్యం అతిపెద్దదని డబ్ల్యూహెచ్‌ఓ అభిప్రాయపడింది. వాయు కాలుష్య నియంత్రణకు ప్రపంచ దేశాలు తక్షణమే చర్యలు ప్రారంభించాలని డబ్ల్యూహెచ్‌ఓ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే గాలి నాణ్యత మార్గదర్శకాలకు కఠినతరం చేసింది.
గాలి కాలుష్య ప్రభావం ఏ ఒక్క దేశానికో, ప్రాంతానికో పరిమితం కాదని.. ఇది ప్రపంచ సమస్య అని తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచ దేశాలు వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని తెలిపింది. ఇక గాలి కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005లో ఎయిర్ క్వాలిటీ గైడ్‌లైన్స్ (AQG)ని రూపొందించింది.
అయితే తాజాగా మరోసారి వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోన్న నేపథ్యంలో తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సదరు సూచనలను కఠినతరం చేసే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను సవరించింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12వరకు గ్లాస్గోలో జరిగే ప్రపంచ పర్యావరణ సదస్సు-COP26 నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు విడుదల చేశారు.
Volcano Eruption: 50 ఏళ్ల తర్వాత పేలిన అగ్ని పర్వతం.. ఇళ్లల్లోకి వచ్చిన లావా.. 100 ఇళ్లు ధ్వంసం
BMW: బీఎండబ్ల్యు..డైమ్లర్ కార్లపై కోర్టు కెక్కిన అక్కడి ప్రజా సంస్థలు.. ఎందుకంటే..