Corona: కరోనా తీవ్ర దశ ముగిసిందని చెప్పలేము.. ప్రపంచ దేశాలకు డబ్య్లూహెచ్ఓ వార్నింగ్
రెండేళ్ల క్రితం వెలుగుచూసిన కరోనా(Corona) ప్రపంచాన్ని గడగడలాడించింది. వైరస్ విజృంభణతో ఎన్నో దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. ముఖ్యంగా అమెరికా, ఇండియా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తీవ్ర...
రెండేళ్ల క్రితం వెలుగుచూసిన కరోనా(Corona) ప్రపంచాన్ని గడగడలాడించింది. వైరస్ విజృంభణతో ఎన్నో దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. ముఖ్యంగా అమెరికా, ఇండియా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. కాలక్రమేణా వైరస్ వివిధ రకాలుగా పరిణామం చెందడం, పలు దేశాల్లో టీకా అందుబాటులోకి రావడంతో కరోనా విజృంభణ కొత్త వరకు తగ్గుముఖం పట్టింది. కొన్ని దేశాల్లో బూస్టర్ డోసుల(Booster Dose) పంపిణీ కూడా జరుగుతోంది. మనదేశంలో మూడోవేవ్ అంతగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ.. కరోనా తీవ్ర దశ ముగిసిందని చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కొన్ని దేశాలు మహమ్మారి అత్యవసర దశను ముగించగలిగి ఉండొచ్చన్న డబ్ల్యూహెచ్ఓ కానీ, అన్ని దేశాల్లో అలాంటి పరిస్థితి లేదని వ్యాఖ్యానించింది. అందుకే అంతర్జాతీయ స్థాయిలో దీనిపై మన పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చింది. వాక్సినేషన్ మెరుగ్గా జరిగిన దేశాల్లో ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు తక్కువగా ఉన్నాయని చెప్పింది. వ్యాక్సినేషన్ స్థాయులు తక్కువగా ఉన్న దగ్గర మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
పేద దేశాల్లో 16 శాతం మంది అర్హులకే టీకా అందిందన్న డబ్ల్యూహెచ్ఓ.. దక్షిణాఫ్రికాలో గత మూడు వారాల్లో కరోనా కేసులు నాలుగు రెట్లు పెరిగాయని, మరణాలు రెట్టింపయ్యాయని వెల్లడించింది. గత వేవ్‌తో పోల్చుకుంటే ఆసుపత్రిలో చేరికలు 20 శాతమేనని తెలిపింది. ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్‌వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇదీ చదవండి
CNG Price Hike: వాహనదారులకు షాక్.. పెరిగిన CNG ధర.. ప్రధాన నగరాల్లో కొత్త రేట్ల వివరాలు