AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: నన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ సంచలన వ్యాఖ్య

తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఆరోపించారు. పాకిస్తాన్(Pakistan) లో లేదా విదేశాల్లో తనను చంపేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తనకు...

Pakistan: నన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ సంచలన వ్యాఖ్య
Imran Khan
Ganesh Mudavath
|

Updated on: May 15, 2022 | 9:25 AM

Share

తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఆరోపించారు. పాకిస్తాన్(Pakistan) లో లేదా విదేశాల్లో తనను చంపేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తనకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. దొంగలను దేశంలోకి చొప్పించడం చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. పాత పాలకుల అవినీతి గురించి కథలు చెప్పడానికి బదులు తమ సొంత ప్రభుత్వ పనితీరుపై దృష్టిపెట్టాలని సూచించారు. అధికారంలోకి వచ్చిన దొంగలు న్యాయవ్యవస్థ సహా అన్ని సంస్థలనూ నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 20న నిర్వహించే ప్రదర్శనలో భాగంగా రాజధానిలోకి ప్రవేశించకుండా తనను ఎవరూ ఆపలేరని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని ఇమ్రాన్ హెచ్చరించారు. అయితే గతంలో జరిగిన పరిణామాలతో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అనేక వాయిదాల మధ్య సుమారు 14 గంటల పాటు సాగిన జాతీయ అసెంబ్లీ అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్‌ పదవి నుంచి తొలగింపబడ్డారు.

పాకిస్తాన్‌ చరిత్రలో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ నిలిచారు. పాక్‌ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉండగా, మెజార్టీకి అవసరమైన బలం 172. అయితే ఇమ్రాన్‌ సర్కార్‌కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్‌ ఆయాజ్‌ సాదిఖ్‌ ప్రకటించారు. సరైన బలం లేకపోవడంతో ఇమ్రాన్‌ సర్కార్‌ దిగిపోయింది. దీంతో కొత్త ప్రధాన షెహబాడ్ షరీఫ్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

పాకిస్తాన్ ముస్లిం లీగ్ ఎన్ నాయకుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) సమర్థవంతమైన పరిపాలనాదక్షుడిగా పేరు పొందారు. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఆయన ఇమ్రాన్ ప్రభుత్వంపై పలు అంశాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అతను పంజాబ్ ప్రావిన్స్ (పాకిస్తాన్)కి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

ఇవి కూడా చదవండి

CNG Price Hike: వాహనదారులకు షాక్‌.. పెరిగిన CNG ధర.. ప్రధాన నగరాల్లో కొత్త రేట్ల వివరాలు